ఎమ్మెల్యే శ్రీదేవి బర్త్‌డే వేడుకలో పాల్గొని వెళ్తున్న వైసీపీ కార్యకర్తలు మృతి

ఎమ్మెల్యే శ్రీదేవి బర్త్‌డే వేడుకలో పాల్గొని వెళ్తున్న వైసీపీ కార్యకర్తలు మృతి

కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కరిడికొండ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను తప్పించబోయి కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు వైసీపీ కార్యకర్తలు మృతిచెందగా.. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే శ్రీదేవి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల స్వస్థలం వెల్దుర్తిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తుచేస్తున్నారు.


Tags

Next Story