Nellore Rottela Panduga: నెల్లూరు బారాషాహిద్ దర్గాలో రొట్టెల పండుగ.. ప్రధాన ఘట్టం పూర్తి..

Nellore Rottela Panduga: నెల్లూరు బారాషాహిద్ దర్గాలో రొట్టెల పండుగ ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రధాన ఘట్టం గంధ మహోత్సవాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మత పెద్దలు తెచ్చే గంధం కోసం భక్తులు వేయికళ్లతో ఎదురుచూశారు. కోటమిట్టలోని అమినీయా మసీదులో 12 మంది ముస్లిం పెద్దలు 12 బిందెలతో గంధాన్ని కలిపారు. ఆ తర్వాత మేళతాళాల మధ్య అర్థరాత్రి 2 గంటలకు దర్గాకు తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా విన్యాసాలు అలరించాయి. గంధాన్ని తీసుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. కడపకు చెందిన ఆరిఫుల్లా హుస్సేని ఆధ్వర్యంలో 12 సమాధుల వద్ద ప్రార్ధనలు నిర్వహించి మొదటి బిందె గంధాన్ని 12 సమాధులకు లేపనం చేశారు. మిగతా 11 బిందెల గంధాన్ని భక్తులకు పంచారు. ఈ గంధాన్ని తమ దగ్గరుంచుకుంటే మంచి జరుగుతుందని భక్తులు భావిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com