MLA Daggupati Prasad : తొలి ఏడాదిలోనే రూ.118 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు

MLA Daggupati Prasad : తొలి ఏడాదిలోనే రూ.118 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు
X

తొలి ఏడాదిలోనే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రూ.118 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. నగరంలోని 27వ డివిజన్ పరిధిలో ఆయన ఇవాళ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సంస్థాగత ఎన్నికల పరిశీలకుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నియోజకవర్గం పరిశీలకుడు లక్ష్మీనారాయణతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ ఏపీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ అని.. ఆయనపై నమ్మకంతోనే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయన్నారు. అనంతపురం జిల్లాలో గతంలో కియా పరిశ్రమ రావడం వల్ల.. దాని అనుబంధంగా పెద్ద ఎత్తున ఆటోమొబైల్ పరిశ్రమలు వచ్చాయన్నారు. ఇప్పుడు సోలార్, ఇతర రంగాల్లో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని దగ్గుపాటి అన్నారు. ఒక అనంతపురం జిల్లాకే పదివేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. డంపింగ్ యార్డ్ తరలింపు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నడిమివంక, మరువవంక ప్రొటెక్షన్ వాల్స్ నిర్మాణాలు త్వరలోనే చేపడుతామన్నారు.

Tags

Next Story