Pulivendula : పులివెందులలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు

X
By - Manikanta |23 Oct 2024 2:45 PM IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా పులివెందులలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. కదిరి నుంచి పులివెందులకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. బస్సులో 20 మంది ప్రయాణిస్తున్నట్టు తెలిసింది. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి అతివేగమే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. గాయపడ్డవారిని 108లో పులివెందుల ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com