మరోసారి ఏపీ ప్రభుత్వ తీరుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

మరోసారి ఏపీ ప్రభుత్వ తీరుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చిత్తూరు జిల్లాలోని వెదురు కుప్పం మండలం తిరుమలాయపల్లి గ్రామంలో సచివాలయం కట్టొద్దంటూ.. గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ.. అదే స్థలంలో రైతు భరోసా కేంద్రం నిర్మాణం చేపట్టారు అధికారులు. దీంతో కోర్టు ఆదేశాలు అపహాస్యం చేస్తారా అంటూ అధికారులపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టికల్ 215 ప్రకారం సుమోటోగా తీసుకొని అధికారులపై చర్యలు తీసుకుంటామని.. జైలుకు కూడా పంపుతామంటూ హైకోర్టు హెచ్చరించింది. పాత నిర్మాణాలు చేపట్టవద్దంటూ హైకోర్టు ఆదేశాలు ఉన్నా.. నిర్మాణాలు చేపట్టడం చట్టవిరుద్ధమన్నారు పిటిషనర్ తరఫు న్యాయవ్యాది శ్రావణ్‌కుమార్. హైకోర్టు ఆదేశాలు దిక్కరిస్తూ స్మశానవాటికలో నిర్మాణాలు చేపడుతున్నారని ఆయన ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com