Saiteja: కాసేపట్లో సాయితేజ అంత్యక్రియలు.. ఆంధ్ర సరిహద్దు నుంచి భారీ బైక్ ర్యాలీ..
Saiteja (tv5news.in)
Saiteja: ఆర్మీ హెలికాప్టర్ దుర్ఘటనలో అసువులు బాసిన తెలుగుతేజం లాన్స్‌నాయక్ సాయితేజ అంతిమ సంస్కారాలు కాసేపట్లో జరగనున్నాయి. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడలో ప్రజల సందర్శన అనంతరం సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు.సాయితేజ పార్థివదేహాన్ని బెంగుళూరులోని బేస్ క్యాంపు నుంచి ప్రత్యేక అంబులెన్స్ లో ఉదయం తీసుకొచ్చారు.
ప్రస్తుతం చిత్తూరు జిల్లాలలోకి అంబులెన్స్ ప్రవేశించింది. కర్ణాటక- ఆంధ్ర సరిహద్దులోని చీకల బైలు నుంచి అంతిమయాత్ర నిర్వహిస్తున్నారు. జై జవాన్ అంటూ.. జాతీయ జెండాలు చేతపట్టి యువత పెద్దసంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొంటున్నారు. అంతిమయాత్ర అనంతరం మధ్యాహ్నం కురబలకోట మండలం ఎగువరేగడ గ్రామంలో అంత్యక్రియలు జరుగుతాయి.
ఎగువరగడ గ్రామంలోని రెండు ఎకరాల స్థలంలో సాయితేజ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అంతిమ సంస్కారాలకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఎగువరగడ గ్రామాన్ని విషాదఛాయలు వదలట్లేదు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com