Saiteja: సాయితేజ అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి.. భారీ ర్యాలీగా..

Saiteja (tv5news.in)

Saiteja (tv5news.in)

Saiteja: ఆర్మీ హెలికాప్టర్ దుర్ఘటనలో అసువులు బాసిన తెలుగుతేజం లాన్స్‌నాయక్ సాయితేజ అంతిమ సంస్కారాలు ఇవాళ జరగనున్నాయి.

Saiteja: ఆర్మీ హెలికాప్టర్ దుర్ఘటనలో అసువులు బాసిన తెలుగుతేజం లాన్స్‌నాయక్ సాయితేజ అంతిమ సంస్కారాలు ఇవాళ జరగనున్నాయి. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడలో ప్రజల సందర్శన అనంతరం సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. లాన్స్‌ నాయక్‌ పార్ధీవదేహం ఢిల్లీ నుంచి బెంగళూరుకు తరలించే సరికి నిన్న సమయం మించిపోయింది.

సైనికాధికారుల నివాళుల అనంతరం బేస్ క్యాంప్ మార్చురీలో పార్థివదేహాన్ని భద్రపరిచారు. ఈ రోజు ఉదయం బెంగళూరు నుంచి ప్రత్యేక అంబులెన్స్‌ లో సాయితేజ పార్థివదేహాన్ని అతని స్వగ్రామానికి తీసుకువస్తున్నారు. వీర జవాన్‌కు కర్ణాటక- ఆంధ్ర సరిహద్దుల వద్దే ఘనంగా నివాళులు అర్పించి భారీ ద్విచక్రవాహన ర్యాలీతో స్వగ్రామానికి తరలించేలా ఏర్పాట్లు చేశారు. కుటుంబసభ్యులకు సాయితేజ పార్థివదేహాన్ని సైనిక అధికారులు అందజేస్తారు.

కాగా సాయితేజ అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎగువరగడ గ్రామంలోని రెండు ఎకరాల స్థలంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. చిత్తూరు జిల్లా కలెక్టర్‌ హరినారాయణ్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అంతిమ సంస్కారాలకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇంటి వద్ద నుంచి భారీ ర్యాలీగా అంతిమయాత్ర సాగనుంది.

మరోవైపు ఎగువరగడ గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. హెలికాప్టర్‌ ప్రమాదం జరిగిన నాలుగు రోజుల తర్వాత స్వగ్రామానికి సాయితేజ పార్థివదేహం రానుంది. సాయితేజ భార్య శ్యామలతో పాటు తల్లిదండ్రులు భువనేశ్వరి, మోహన్‌ కన్నీటిపర్యంతమవుతున్నారు. లాన్స్‌నాయక్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు. 50 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ప్రభుత్వం అన్ని విధాలా సాయితేజ కుటుంబాన్ని ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

Tags

Next Story