ముగిసిన సాయితేజ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు

ముగిసిన సాయితేజ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు
లాన్స్ నాయక్ సాయితేజ అంత్యక్రియలు ముగిశాయి. చిత్తూరు జిల్లా ఎగువరేగడ గ్రామంలోని రెండు ఎకరాల స్థలంలో సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరిగాయి.

లాన్స్ నాయక్ సాయితేజ అంత్యక్రియలు ముగిశాయి. చిత్తూరు జిల్లా ఎగువరేగడ గ్రామంలోని రెండు ఎకరాల స్థలంలో సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరిగాయి. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవానుకు కన్నీటి వీడ్కోలు పలికారు. సాయితేజను కడసారి చూసేందుకు ఎగువరేగడకు పెద్దసంఖ్యలో జనం తరలివచ్చారు. చుట్టుపక్కల గ్రామాలనుంచి సైతం వచ్చిన జనంతో ఎగువరేగడ కన్నీటి సంద్రమైంది.

అంతకు ముందు బెంగుళూరు నుంచి ప్రత్యేక అంబులెన్సులో వచ్చిన సాయితేజ పార్థివదేహానికి కర్ణాటక- ఆంధ్ర సరిహద్దుల నుంచే ఘనమైన నివాళి అర్పించారు. దాదాపు 30కిలోమీటర్ల మేర భారీ ర్యాలీగా అంతిమయాత్ర నిర్వహించారు. జాతీయ జెండాలు చేతపట్టి... జై జవాన్ నినాదాలతో సాయితేజకు కన్నీటి వీడ్కోలు పలికారు.

సాయితేజ పార్థివదేహం ఇంటికి చేరడంతో గ్రామంలో విషాధం అలుకుముంది. గత నాలుగు రోజులుగా కడసారి చూపుకోసం నిరీక్షించిన కుటుంబసభ్యులు సాయితేజను మోసుకొచ్చిన పెట్టెను చూసి గుండెలు పగిలేలా ఏడ్చారు. భర్తను ఆస్థితిలో చూసిన భార్య శ్యామలా... సొమ్మసిల్లి పడిపోయింది. ఏం జరుగుతుందో కూడా తెలియని సాయితేజ పిల్లలు ధీనంగా కనిపించారు. కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.

Tags

Read MoreRead Less
Next Story