AP : సజ్జల భార్గవ్ రెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్ధం

AP : సజ్జల భార్గవ్ రెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్ధం
X

వైసీపీ సోషల్ మీడియా సమన్వయకర్త సజ్జల భార్గవ్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే సజ్జల భార్గవ్ కు నోటీసులు ఇచ్చిన పోలీసులు.. తాజాగా ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. సజ్జలతో పాటు అర్జున్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. సజ్జల భార్గవ్ విదేశాలకు వెళతారనే అనుమానంతోనే లుకౌట్ నోటీస్ ఇచ్చారని తెలుస్తోంది. సజ్జల భార్గవ్ డైరెక్షన్ లోనే సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు అసత్యాలు ప్రచారం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి పోలీసులకు భారీగా ఫిర్యాదులు వచ్చాయి.

Tags

Next Story