AP Salaries : ఏపీ ఉద్యోగులకు అందని జీతాలు.. ఐదో తారీఖు దాకా వేచిచూడక తప్పదా..?

AP Salaries : ఏపీ ఉద్యోగులకు అందని జీతాలు.. ఐదో తారీఖు దాకా వేచిచూడక తప్పదా..?
AP Salaries : ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా జీతాలు అందలేదు. సాధారణంగా ఒకటో తారీఖునే అందాల్సి ఉన్నా.. ఈ సారి మాత్రం ఐదో తారీఖు దాకా వేచిచూడక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.

AP Salaries : ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా జీతాలు అందలేదు. సాధారణంగా ఒకటో తారీఖునే అందాల్సి ఉన్నా.. ఈ సారి మాత్రం ఐదో తారీఖు దాకా వేచిచూడక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. సాంకేతిక కారణాల వల్లే జీతాలు ఆలస్యమయ్యాయని ప్రభుత్వం చెబుతుండగా… అలాంటిదేమీ లేదని ఖజానాలో చిల్లిగవ్వ కూడా లేనందువల్లే ఈ పరిస్థితి అంటున్నాయి ఉద్యోగ సంఘాలు.

కేంద్రాన్ని అప్పు చేసుకునేందుకు అనుమతి కోరారని… అనుమతి వస్తే అప్పు చేసి జీతాలు ఇస్తారని ఉద్యోగులు చెబుతున్నారు. నాలుగో తారీఖు గానీ, ఐదో తారీఖున గానీ.. కేంద్రం నుంచి అనుమతి వస్తుందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. మరోవైపు సాంకేతిక కారణాన్ని సాకుగా చెబుతున్న సర్కారు… బిల్లులన్నీ మళ్లీ సమర్పించాలని ట్రెజరీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ ప్రక్రియకు మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉంది. ఎలాగూ శని, ఆది వారాలు సెలవు రోజులు కాబట్టి… ఇక నాలుగు, ఐదో తేదీల్లోనే బిల్లులు సబ్మిట్‌ అవుతాయని.. ఆ తర్వాత విడతల వారిగా జీతాల చెల్లింపు ఉంటుందని ఉద్యోగులు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story