AP: జగన్‌ పాలనలో విచ్చలవిడిగా ఇసుక దోపిడీ

AP: జగన్‌ పాలనలో విచ్చలవిడిగా ఇసుక దోపిడీ
అదుపు లేకుండా రెచ్చిపోయిన వైసీపీ నేతలు... ఇసుకను తవ్వుకుని పర్యావరణ విధ్వంసం

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వనురులను వైసీపీ దోపిడీ చేస్తూనే ఉంది. ముఖ్యంగా ఇసుక తవ్వకాల్లో అడ్డు...అదుపు లేకుండా రెచ్చిపోయింది. అందినకాడికి ఇసుకను తవ్వుకుని పర్యావరణ విధ్వంసానికి పాల్పడింది. చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ -NGT ఆదేశాల మేరకు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు-CPCB, కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ అధికారులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశీలించి..ఒక నివేదిక సిద్ధం చేశారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు నిజమేనని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఈ ఏడాది ఫిబ్రవరిలో హైకోర్టు, NGTకు తెలిపాయి. ఇసుక గుత్తేదారు, రాష్ట్ర ప్రభుత్వం, గనులశాఖ, జిల్లా కలెక్టర్ల తీరుపై NGT మండిపడింది. ఇదంతా చేసిన గుత్తేదారు శిక్షార్హులేనంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నివేదిక సుప్రీంకోర్టుకు సమర్పించాలని ఆనాడు ఆదేశించింది.

NGT నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక అక్రమ త్వవకాలపై మండిపడింది. అనుమతులు లేని ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. జాతీయ హరిత ట్రైబ్యునల్‌-NGT తీర్పును యథాతథంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. అక్రమ తవ్వకాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. తమకు అత్యంత సన్నిహిత కంపెనీ అయిన జేపీ వెంచర్స్‌కు అప్పనంగా ఇన్నాళ్లు దోచిపెట్టారు. మరి, ఇప్పుడు వైసీపీ నేతలు...ముఖ్యంగా జగన్‌మోహన్‌రెడ్డి ఎవరి కళ్లకు గంతలు కడుతారో చెప్పాలి. ఇన్నాళ్లు తమ తప్పులు లేవన్నట్టు వ్యవహారించి తోడేళ్ల గుంపు మాదిరి పర్యావరణ విధ్వంసం చేశారు. దీనికి ఏం సమాధానం చెబుతారు. ఇప్పుడు కూడా అక్రమ ఇసుక తవ్వకాలు జరపడం లేదని...అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని జేపీ వెంచర్స్‌కి సుప్రీం ఆదేశాలు జారీచేసింది మరి ఇప్పుడైనా నిశబ్దంగా ఉంటారా..? లేదా కోర్టులతో మనకేంటి పని అని మళ్లీ తవ్వేస్తారా...?

గతేడాది ఆగస్టులో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపి వేయాలని నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ తీర్పు వెలువరించింది. ఐనా, నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్రవ్యాప్తంగా ఇసుక తవ్వకాలు చేస్తుండటంపై గుంటూరు జిల్లాకు చెందిన దండా నాగేంద్ర కుమార్‌, చిత్తూరు జిల్లాలోని అరణియార్‌ నదిలో ఇసుక తవ్వకాలపై డి.హేమకుమార్‌ గతంలో NGTలో పిటిషన్లు దాఖలు చేశారు. నాగేంద్రకుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం..రాష్ట్రంలోని 110 ఇసుక రీచ్‌లలో వెంటనే తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు ఆదేశాలను తీర్పులో పేర్కొన్న NGT...గత ఉత్తర్వులు అరణియార్‌ నదిలోని 18 రీచ్‌లకే పరిమితం కాదని స్పష్టం చేసింది. ఆనాడే తమ ఆదేశాలను ఏపీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని కూడా వ్యాఖ్యానించింది. అదే NGT ఆదేశాలతో కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులు...రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశీలించి ..NGT నిలిపివేయాలని చెప్పిన వాటిల్లోనే యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నాయని సాక్ష్యాధారాలతో సహా బయపెట్టింది.

గత ప్రభుత్వంలో ఉచిత ఇసుక విధానం అమల్లో ఉండేది. ఇసుక కావాలంటే లోడింగ్‌, రవాణా ఖర్చు భరిస్తే సరిపోయేది. కానీ, వైసీపీ అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక విధానం రద్దుచేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా కొరత ఏర్పడింది. అయిదారు నెలలపాటు ఇసుక దొరకడం గగనమైపోయింది. అప్పటికే దోచుకోవడంలో సిద్ధహస్తుడైన మన జగన్‌...తన చేతికి ఇసుక అంటకుండా..చక్కగా లాభాలొచ్చే...ఇసుకను ఆదాయం మార్గంగా ఎంచుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story