AP : సంక్రాంతి ఎఫెక్ట్.. రూ.400 కోట్ల మద్యం తాగేశారు!

ఏపీలో సంక్రాంతి పండుగ 3 రోజుల్లో దాదాపు రూ. 400 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. సంక్రాంతి, కనుమ రోజుల్లో రూ. 150కోట్ల చొప్పున అమ్ముడైనట్లు తెలుస్తోంది. సాధారణ రోజుల్లో రోజుకు రూ. 80కోట్ల సేల్ జరుగుతుండగా, ఈ 3 రోజుల్లో రూ. 160cr అదనంగా అమ్ముడైంది. ఈనెల 10 నుంచి 15 వరకు 6.99 లక్షల కేసుల లిక్కర్, 2.29L కేసుల బీరు అమ్ముడైంది. గతంలో సంక్రాంతికి ఎప్పుడూ ఈ రేంజ్‌లో అమ్మకాలు జరగలేదని ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి. సంక్రాంతి, కనుమ రోజుల్లో రూ.150కోట్ల చొప్పున అమ్ముడైనట్లు తెలుస్తోంది. సాధారణ రోజుల్లో రోజుకు ₹80కోట్ల సేల్ జరుగుతుండగా....ఈ 3 రోజుల్లో ₹160కోట్లు అదనంగా అమ్ముడైంది. ఈనెల 10 నుంచి 15 వరకు 6.99 లక్షల కేసుల లిక్కర్, 2.29 కేసుల బీరు అమ్ముడైంది.
అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారడం.. మద్యం ధరలు తగ్గించడం, నాణ్యమైన మద్యం సరఫరా వంటి కారణాలు ఏపీలో సంక్రాంతి పండగకు మద్యం అమ్మకాల్లో పెరుగుదలను నమోదు చేశాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఈసారి కోడి పందేల బరులు కూడా భారీగా పెరగడం మద్యం అమ్మకాలను మరో స్థాయికి తీసుకెళ్లాయని పేర్కొంటున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ రాకుండా ఎక్సైజ్ శాఖ పటిష్ట చర్యలు తీసుకోవడంతో మద్యం అమ్మకాలు భారీగా పెరిగినట్లు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com