Ap Assembly: ఏపీ అసెంబ్లీ వద్ద టెన్షన్ టెన్షన్ , సర్పంచుల అరెస్ట్

ముఖ్యమంత్రి జగన్ ను (CM Jagan) కలిసి సమస్యలు చెప్పుకోవాలని వస్తే పోలీసులు అన్యాయంగా అరెస్టు చేశారని గుంటూరు జిల్లా (Guntur District) సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్ల అభివృద్ధి లేక గ్రామాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయన్నారు. అసెంబ్లీ కార్యక్రమం పేరుతో సీఎం జగన్ ను కలవడానికి వచ్చిన సర్పంచ్ లను పోలీసులు అరెస్టు చేసి తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు.
హక్కుల కోసం ఉద్యమిస్తున్న సర్పంచులపై పోలీసులతో ఉక్కుపాదం మోపడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. పల్లెల అభివృద్ధి కోసం కేంద్రం కేటాయించిన నిధులను లాగేసుకున్న వైకాపా ప్రభుత్వం ఆ నిధులను ఇవ్వాలని అడిగిన సర్పంచులపై దౌర్జన్యానికి దిగడం దారుణమన్నారు. రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర లీగల్ సెల్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.జగన్ అర్జునుడు కాదు సైతాన్ అని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విమర్శించారు. వైకాపా ప్రభుత్వం అబద్ధాలతో పాలన సాగిస్తుండడమే కాకుండా అసెంబ్లీలో గవర్నర్ చేత కూడా అవాస్తవాలు పలికించిందన ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందులలో జరిగిన ఉపాధి హామీ నిధుల అవకతవకలపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు ఫిర్యాదు చేస్తానన్నారు. అవినీతి సైతాన్ ను శిక్షించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com