Visakhapatnam: ఘోరం.. స్కూలుకు వెళ్లుతున్న చిన్నారిని ఢీకొట్టిన బస్సు..

Visakhapatnam: ఘోరం.. స్కూలుకు వెళ్లుతున్న చిన్నారిని ఢీకొట్టిన బస్సు..
Visakhapatnam: నాన్న ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాడు.. అమ్మ అతడి మీదే ఆశలన్నీ పెట్టుకుంది. ఉదయాన్నే స్కూటీ మీద స్కూలుకు దింపేందుకు వెళుతోంది.

Visakhapatnam: నాన్న ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాడు.. అమ్మ అతడి మీదే ఆశలన్నీ పెట్టుకుంది. ఉదయాన్నే స్కూటీ మీద స్కూలుకు దింపేందుకు వెళుతోంది. అంతలోనే మృత్యువు కబళించింది. వెనుకనుంచి వచ్చిన బస్సు స్కూటీని ఢీకొట్టింది. వెనుక కూర్చున్న చిన్నారి ఎగిరి అంత దూరంలో పడ్డాడు. బస్సు చక్రం అతడి తల మీద నుంచి వెళ్లడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ దురదృష్టకర సంఘటన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో చోటు చేసుకుంది.


నగర శివారు అగనంపూడి సమీపంలోని శనివాడలో పెరుమాళ్ల సౌజన్య తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. ఆమె భర్త విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారు. వీరికి ఒక్కగానొక్క కుమారుడు ఎలీజా సావెరిన్ (9) డి.పాల్ పాఠశాలలో మూడవతరగతి చదువుతున్నాడు. తల్లీ, కుమారుడు స్కూటీ మీద స్కూలుకు వెళ్ళేందుకు ప్రధాన రహదారి వద్ద మలుపు తిరుగుతున్నారు.


ఇంతలో పరవాడలోని ఏఆర్ లైఫ్ సైన్సెస్ ఫార్మా సంస్థకు చెందిన బస్సు వారిని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. తల్లీ కుమారులిద్దరూ చెరోవైపు ఎగిరిపడ్డారు. చిన్నారి తలపైకి బస్సు చక్రాలు ఎక్కడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఘటనకు బాధ్యులైన బస్సు డ్రైవర్, అందులోని ఉద్యోగులు పరారయ్యారు. దీంతో ఆగ్రహానికి గురైన స్థానికులు బస్సును ధ్వంసం చేశారు.



కూడలిలోకి ఫార్మా సంస్థల బస్సులను, భారీ రవాణా వాహనాలను అనుమతించరాదని, పాఠశాలల యాజమాన్యాలు ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుని వాహనాలను క్రమబద్ధీకరించాలని నినాదాలు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి, ఆందోళనకారులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. వారి డిమాండ్లపై లిఖితపూర్వక హామీ ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story