Guntur: స్కూల్ విద్యార్థుల మధ్య ఘర్షణ.. రెండు వర్గాలుగా విడిపోయి కర్రలు, రాళ్లతో దాడి..

X
By - Divya Reddy |17 May 2022 5:00 PM IST
Guntur: క్రోసూర్ మోడల్ స్కూల్లో రెండు వర్గాలుగా విడిపోయిన విద్యార్థులు ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు.
Guntur: పల్నాడు జిల్లాలో స్కూల్ విద్యార్థులు రెచ్చిపోయారు. క్రోసూర్ మోడల్ స్కూల్లో రెండు వర్గాలుగా విడిపోయిన విద్యార్థులు.. ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వీళ్లు కొట్టుకోవడమే కాదు.. పక్కనే వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు అద్దాలను కూడా ధ్వంసం చేశారు. చదువుకోవాల్సిన విద్యార్థులు ఇలా వీధిరౌడీల్లో వ్యవహరించడంపై స్థానికంగా ఆందోళన నెలకొంది. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మోడల్ స్కూల్ విద్యార్థులు ఇలా గొడవపడండం.. మూడు నెలల్లో ఇది నాలుగువ సారిగా తెలుస్తోంది. ఇప్పటికైనా విద్యార్థులను సరైన దిశలో పెట్టకుంటే.. భవిష్యత్‌లో మరింతగా రెచ్చిపోతారని స్థానికులు వాపోతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com