Coronavirus: విద్యార్థులకు కరోనా..

Coronavirus: విద్యార్థులకు  కరోనా..
Andhra Pradesh: నలుగురు స్కూల్ పిల్లలకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడం కలకలం రేపింది.

గుంటూరు జిల్లాలో నలుగురు స్కూల్ పిల్లలకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడం కలకలం రేపింది. కర్లపాలెం మండలం యాజలి హైస్కూల్‌లో నలుగురు విద్యార్థులకు వైరస్ సోకినట్టు నిర్థారణ అయ్యింది. రిపోర్టులు వచ్చిన వెంటనే అప్రమత్తమైన అధికారులు పాఠశాలలో మిగతా పిల్లలు, సిబ్బందికి కూడా కరోనా పరీక్షలు చేయిస్తున్నారు. ఏపీలో సుదీర్ఘ కాలం తర్వాత ఇటీవలే బడులు ప్రారంభమయ్యాయి. కోవిడ్ నిబంధనలు అమలు చేస్తూ క్లాస్‌లు పెడుతున్నారు. ప్రస్తుతం గుంటూరులో కరోనా కేసులు వెలుగుచూడడంతో అంతా మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Tags

Next Story