మోగింది.. బడిగంట..!

మోగింది.. బడిగంట..!
ఇన్నిరోజులు సెల్‌ఫోన్‌ గేమ్‌లు, గ్రౌండ్స్‌లో పరుగులు, సమ్మర్‌ క్యాంప్‌ల్లో బిజీగా గడిపిన పిల్లలను మళ్లీ స్కూళ్ల బాట పట్టారు. ఏపీలో షెడ్యూల్ ప్రకారమే జూన్ 12 నుంచి బడులు తిరిగి ప్రారంభం అయ్యాయి.

సమ్మర్‌లో స్మార్ట్ ఫోన్‌లో గేమ్స్‌, ఆలస్యంగా నిద్ర పోవడం.. బారెడు పొద్దెక్కాక నిద్ర లేచే రోజులకు చెక్‌ పడింది. స్కూల్‌ గేటు లోపలికి పరుగులు తీసే రోజులు వచ్చేశాయి. అవును.. ఏపీలో ఇవాళ్టి నుంచి బడిగంట మోగింది. ఇన్నిరోజులు సెల్‌ఫోన్‌ గేమ్‌లు, గ్రౌండ్స్‌లో పరుగులు, సమ్మర్‌ క్యాంప్‌ల్లో బిజీగా గడిపిన పిల్లలను మళ్లీ స్కూళ్ల బాట పట్టారు. ఏపీలో షెడ్యూల్ ప్రకారమే జూన్ 12 నుంచి బడులు తిరిగి ప్రారంభం అయ్యాయి. అయితే కొన్ని సడలింపులు చేసింది. గత కొన్ని రోజులుగా ఏపీ వ్యాప్తంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, వేడిగాలులనే దృష్టిలో పెట్టికొని ఒంటి పూట బడులు నిర్వహించాలని సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. జూన్ 17 వరకు ఒక్క పూట బడులు పెట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 7.30 గంటల నుంచి 11:30 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. వేడి గాలులు తీవ్రత ఎక్కువగా ఉన్నందున పాఠశాలల ప్రారంభ తేదీని వాయిదా వేయాలని ప్రతిపక్ష పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నప్పటికీ ఒంటి పూట బడుల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు చూపింది.

మరోవైపు జూన్ 19 నుంచి విద్యా ప్రణాళిక షెడ్యూలు ప్రకారం పాఠశాలలు పూర్తిస్థాయిలో నడుస్తాయని ఉత్తర్వుల్లో తెలిపింది సర్కార్‌. ఇక ఉదయం 8.30 గంటల నుంచి 9 గంటల మధ్య రాగి జావ అందించాలని ఆదేశించింది. ఉదయం 11.30 -12 గంటల మధ్య విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించి వారిని ఇంటకి పంపించాలని..ఏపీ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే జగన్‌ సర్కార్‌ నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది.స్కూళ్లలో మౌలిక సదుపాయాలు అరకొరగా ఉన్నాయని.అమ్మబడి పధకం నగదు విడుదల చేయకపోవడం..లాంటి సమప్యలను పరిష్కరించలేదు. అంతేకాదు టీచర్ల కొరత ఇంకా వేధిస్తూనే ఉంది.పాఠ్యపుస్తకాల పంపిణీ విషయంలో క్లారిటీ లేదు.మరోవైపు విద్యావిధానంపైన కూడా ప్రభుత్వం ఓ స్పష్టత ఇవ్వలేదు. కొత్త విద్యావిధానం అంటూ ఊదరగొట్టిన సర్కార్‌ ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయలేదు. టీచర్ల సమస్యలు అలానే ఉన్నాయి.CPS రద్దు, టెన్త్ ఎగ్జామ్స్‌ మూల్యాంకన సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఉపాధ్యాయ నేతలు. సమస్యల పరిష్కారానికి కమిటీల పేరుతో జగన్ సర్కార్ కాలయాపన చేస్తుండటంపై మండిపడుతున్నారు.ఇది కూడా విద్యా సంవత్సరంపై ఎఫెక్ట్ పడుతుందని పేరంట్స్‌ అంటున్నారు. ఇన్ని సమస్యల మధ్య విద్యార్థులు తిరిగి పాఠశాల బాట పట్టారు.

Tags

Read MoreRead Less
Next Story