అధికారులకు పరోక్ష హెచ్చరికలు చేసిన నిమ్మగడ్డ
ప్లాన్-బీ అంటూ కేంద్ర బలగాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు నిమ్మగడ్డ.

కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో ఎస్ఈసీ నిమ్మగడ్డ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. ఈ సమావేశంలో నిమ్మగడ్డ అధికారులకు పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. ప్లాన్-బీ అంటూ కేంద్ర బలగాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కేంద్ర బలగాలపై ఇప్పటికే కేంద్ర హోంసెక్రటరీకి లేఖ రాశానని వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లో వ్యాక్సినేషన్ ఆగకూడదన్నారు. ఏకగ్రీవాలను స్వాగతించండి.. కానీ ఎన్నికలకే ప్రాధాన్యం ఇవ్వండని నిమ్మగడ్డ సూచించారు. ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు.
Next Story