ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బహిరంగ లేఖ

ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల నిర్వహణలో ఉద్యోగుల అభ్యంతరాలు తమ దృష్టికి వచ్చాయని లేఖలో పేర్కొన్నారు. పోలింగ్ సిబ్బంది భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని, పోలింగ్ సిబ్బందికి పీపీఈ కిట్లు, ఫేస్ షీల్డ్, శానిటైజర్ ఇవ్వాలని సూచించినట్లు తెలిపారు. వ్యాక్సినేషన్‌లో పోలింగ్ సిబ్బందికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్లు లేఖలో వెల్లడించారు. సీఎస్‌తో జరిగిన సమావేశంలోనూ ఇదే స్పష్టం చేశామన్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్.
ఎన్నికల నిర్వహణ రాజ్యాంగ విధి అని.. దీనికి అందరూ సహకరించాలని కోరారు. ప్రకృతి వైపరీత్యాలు లాంటివి ఎదుర్కొన్న ఘనత ఏపీ ఉద్యోగులన్న ఆయన.. ఏపీ ఉద్యోగులకు ఎవరూ సాటిరారన్నారు. రాజకీయాలకతీతంగా పంచాయతీ ఎన్నికలు జరగాలన్నారు. నిర్ణీత సమయంలో ఎన్నికలు నిర్వహిస్తేనే ఆర్థిక సంఘం నిధులు వస్తాయని లేఖలో వెల్లడించారు. అన్ని రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. సమిష్టి కృషితో ఎన్నికలను పూర్తి చేద్దామని బహిరంగ లేఖలో కోరారు ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com