ఏపీలో రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

ఏపీలో రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ రేపు జరుగనుంది. ఉదయం ఆరున్నర గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది.

ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ రేపు జరుగనుంది. ఉదయం ఆరున్నర గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఇక సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు. ఆ తర్వాత ఉపసర్పంచ్‌ ఎన్నిక జరుగనుంది.

ఏపీలోని 13 జిల్లాల్లో ఉన్న 3 వేల 328 గ్రామ పంచాయతీలు, 33 వేల 570 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. అయితే వీటిలో ఇప్పటికే 539 సర్పంచ్ స్థానాలు, 12 వేల 605 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 2 వేల 786 పంచాయతీలు, 20 వేల 796 వార్డులకు ఎలక్షన్స్ జరుగనున్నాయి. సర్పంచ్ పదవి కోసం 7 వేల 510 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. రెండో విడత ఎన్నికల కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ఎన్నికల స్థితిగతులను SEC ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది.

మరోవైపు మూడో విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇవాళ్టితో ముగిసింది. మూడో దశలో ఎన్నికలు జరిగేవాటిలో 3 వేల 249 పంచాయతీలు, 32 వేల 502 వార్డు స్థానాలు ఉన్నాయి. ఈ నెల 17న మూడో దశ పోలింగ్ జరుగనుంది. సర్పంచ్ స్థానాల కోసం 17 వేల 447 నామినేషన్లు వస్తే... వార్డు మెంబర్ల కోసం 77 వేల 447 నామినేషన్లు దాఖలయ్యాయి.

నాలుగో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నేటితో ముగియనుంది. నిన్న అమావాస్య కావడంతో నామినేషన్లు మందకొడిగా దాఖలయ్యాయి. నాలుగో విడత పోలింగ్ జరిగేవాటిలో 13 జిల్లాల్లోని 3 వేల 299 పంచాయతీలు, 33 వేల 434 వార్డు స్థానాలున్నాయి. నాలుగో దశ ఎన్నికల పోలింగ్ ఈ నెల 21న జరుగనుంది.

Tags

Next Story