Home
 / 
ఆంధ్రప్రదేశ్ / రెండో దశ పంచాయతీ...

రెండో దశ పంచాయతీ ఎన్నికలకు తొలిరోజు 7,170 నామినేషన్లు

ఫిబ్రవరి 4 సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లకు అవకాశం ఉంది.

రెండో దశ పంచాయతీ ఎన్నికలకు తొలిరోజు 7,170 నామినేషన్లు
X

రెండో దశ పంచాయతీ ఎన్నికలకు తొలిరోజు సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు 7,170 నామినేషన్లు దాఖలయ్యాయి. 13 జిల్లాల్లో సర్పంచి స్థానాలకు 2,619.. వార్డు సభ్యుల స్థానాలకు 6,561 మంది నామినేషన్లు వేశారు. రెండో దఫాలో 3,335 సర్పంచి, 33,632 వార్డు సభ్యుల స్థానాల్లో ఈనెల 13న ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 4 సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లకు అవకాశం ఉంది.

అటు తొలి విడత ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల పరిశీలన మంగళవారం ముగిసింది. 3,249 సర్పంచ్ స్థానాలకు బరిలో 18వేల 168 మంది అభ్యర్థులు నిలిచారు. ఇక 35,502 వార్డు సభ్యుల స్థానాలకు 77,554 మంది అర్హత సాధించారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాటు మండలం కనపర్తి, దాసరివారిపాలెం పంచాయతీలకు కోర్టు స్టే అమలులో ఉంది.


Next Story