AP : సచివాలయ ఉద్యోగుల సంఘం నేత అరెస్ట్
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డిని అర్థరాత్రి ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర సచివాలయ క్యాంటీన్ ఎన్నికల్లో ఉద్యోగులను ప్రలోభ పెట్టేందుకు ఆయన మందు, విందు పార్టీలు ఇచ్చారు. ఉద్యోగులను ప్రభావితం చేయడానికి గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని కొండపావులూరి గార్డెన్‌లో ఉద్యోగులకు మందు పార్టీ ఇచ్చారు. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం... ఇటువంటి మందు పార్టీలు ఏర్పాటుకు ముందుగా ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతి తప్పనిసరి. సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి వెంకట్రామిరెడ్డిని గురువారం అర్థరాత్రి అరెస్టు చేశారు. వెంకట్రామిరెడ్డి ఆహ్వానిస్తే వచ్చామని, తమకేమీ తెలియదని అక్కడికి వచ్చిన ఉద్యోగులు తెలిపారు. సచివాలయం క్యాంటీన్ ఎన్నికల్లో మొత్తం 10 డైరెక్టర్ పదవుల కోసం 28 మంది పోటీలో ఉన్నారు. వెంకట్రామిరెడ్డి వర్గం నుంచి 11 మంది పోటీలో ఉన్నారు. ఉద్యోగ నేత కంటే వైసీపీ కార్యకర్తగానే వెంకట్రామిరెడ్డి ఎక్కువగా వ్యవహరించారని ఆరోపణలున్నాయి. సాధారణ ఎన్నికలకు ముందు కోర్టు సమయంలో వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారం చేసినందుకు ప్రస్తుతం వెంకటరామిరెడ్డి సస్పెన్షన్లో ఉన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com