Nara Lokesh : ఉచిత బస్సు టికెట్‌తో సెల్ఫీ.. మహిళలకు లోకేశ్ పిలుపు

Nara Lokesh : ఉచిత బస్సు టికెట్‌తో సెల్ఫీ.. మహిళలకు లోకేశ్ పిలుపు
X

రాష్ట్రంలో మహిళా సాధికారతను ప్రపంచానికి చాటి చెప్పాలని మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఉచిత బస్సు టికెట్‌తో సెల్ఫీ దిగి, #FREEbusTicketSelfie అనే ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని మహిళలను ఆయన కోరారు. మహిళలకు సురక్షితమైన, గౌరవప్రదమైన ఉచిత బస్సు ప్రయాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని వెల్లడించారు. ఈ ఉచిత బస్సు టికెట్ కేవలం ప్రయాణ సౌకర్యం మాత్రమే కాదని.. అది ఆశ, స్వేచ్ఛ, గౌరవం వంటి అంశాలకు ప్రతీక అని ఆయన వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి, ఉచిత బస్సు ప్రయాణ పథకం మహిళలకు సాధికారత కల్పించడంలో గర్వించదగిన చర్య అని మంత్రి అన్నారు. ఈ పథకం మహిళలకు స్వాతంత్ర్యం, సమానత్వంతో కూడిన అవకాశాలను అందిస్తుందన్నారు. ఈ సెల్ఫీ ఛాలెంజ్ ద్వారా రాష్ట్రంలో మహిళలకు లభిస్తున్న సాధికారతను ప్రపంచానికి తెలియజేయవచ్చని లోకేశ్ అభిప్రాయపడ్డారు.

Tags

Next Story