NTR: తెలుగోడి ఆత్మభిమాన ప్రతీక "ఎన్టీఆర్"

టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం నందమూరి తారకరామారావు 29వ వర్థంతి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. తెలుగు రాజకీయాలతోపాటు దేశ రాజకీయాలపైన ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారు. నందమూరి తారక రామారావు సినిమాల్లో ఎవరికీ సాధ్యం కానీ రికార్డులను నెలకొల్పారు. అదే సమయంలో రాజకీయాల్లో అతి తక్కువ సమయంలో పెను సంచలనమే సృష్టించారు. 13 యేళ్ల రాజకీయ జీవితంలో 4 సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 1983, 1984, 1985 వరుసగా మూడేళ్లు ఆంధ్ర ప్రదేశ్‌గా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఘనత ఎన్టీఆర్‌కు దక్కుతుంది. ఎన్టీఆర్ రావడంతో రాజకీయాల్లో సినీ నటులకు విలువ పెరిగింది. ఆయన కంటే ముందు కొంత మంది నటులు పొలిటికల్ గా రాణించారు. ప్రాంతీయ పార్టీలకు దేశ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుంది. తెలుగు దేశం పార్టీ అధినేతగా చైతన్య రథంపై ఆయన చేసిన యాత్రసంచలనం సృష్టించింది. అద్వానీ మిగతా నాయకులకు రథయాత్రలకు ఎన్టీఆర్ యాత్ర ప్రేరణగా నిలిచింది.
ఎన్టీఆర్ ప్రసంగాల్లో తొలి పలుకు తెలుసా?
‘సినిమా వాళ్లను చిన్నచూపుతో చూడకండి.. ఏదో ఒక రోజు వారు ప్రపంచాన్నే మార్చేయగలరు’ అన్న ఆంగ్ల రచయిత బెర్నాడ్ షా మాటలను నిజం మహనీయుడు ఎన్టీఆర్. నేడు NTR వర్ధంతి. ఈ సందర్భంగా NTR ప్రసంగాల్లో తొలి పలుకు అభిమానులు సర్మించుకుంటున్నారు. ‘తెలుగు జనతకు వందనం.. తెలుగు యువతకు అభివందనం.. తెలుగు మమతకు అభినందనం.. తెలుగు జాతికి శుభాభివందనం’ అనే మాటలు తెలుగోడి సత్తాను జగమంతా చాటిందని గుర్తు చేసుకుంటున్నారు.
టీడీపీని ఎందుకు స్థాపించారంటే.. ?
సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సీనియర్ ఎన్టీఆర్… పరిపాలనలో సమూల మార్పులకు ఆద్యుడు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం.. తెలుగు నేతలను, తెలుగు వారిని చులకనగా చూస్తున్నారనే కారణంతో తెలుగోడి ఆత్మాభిమానం చాటాలనే లక్ష్యం పెట్టుకున్నారు. దానిలో భాగంగానే 1982లో తెలుగు దేశం అని పేరుతో పార్టీని స్థాపించారు. 1983లో తెలుగు నేలపై మొట్టమొదటి కాంగ్రెసేతర సీఎంగా ఎన్నికై ఉమ్మడి ఏపీలో నవశఖానికి నాంది పలికారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com