MBU : సంచలన ఆడియో.. ఎంబీయూ అడ్డంగా దొరికిపోయిందిగా..

MBU : సంచలన ఆడియో.. ఎంబీయూ అడ్డంగా దొరికిపోయిందిగా..
X

తిరుపతిలోని లో అధిక ఫీజుల పర్వం ఇప్పుడు సంచలనం రేపుతోంది. అసలు తమ యూనివర్సిటీలో అదనపు వసూళ్లే లేవని.. తామంతా పేద విద్యార్థుల కోసమే తక్కువ ఫీజులకు విద్య అందిస్తున్నాం అంటూ మంచు విష్ణు స్పందించారు. కానీ మోహన్ బాబు యూనివర్సిటీ ఏకంగా రూ.26 కోట్లు అత్యధికంగా వసూలు చేసిన ఫీజులపై నానా రచ్చ జరుగుతోంది. ఈ ఫీజుల గురించి మాట్లాడకుండా ఉన్నత విద్యా కమిషన్ ఉత్తర్వులు కరెక్ట్ కాదంటూ విష్ణు తెలిపారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ అధిక ఫీజుల విషయంలోనే రూ.15లక్షలు ఫైన్ కూడా కట్టింది మోహన్ బాబు యూనివర్సిటీ. ఇవన్నిటికి తోడు ఇప్పుడు ఓ సంచలన ఆడియో లీక్ అయింది.

యూనివర్సిటీ ప్రతినిధికి ఓ స్టూడెంట్ కు ఫీజు విషయంలో జరిగిన ఆడియో సంచనలంగా మారింది. రూ.1500 ఎగ్జామ్ ఫీజు ఉంటే.. నాలుగు రోజులు ఆలస్యంగా స్టూడెంట్ చూసుకున్నాడు. దీంతో లేట్ అయిన ఒక్కో రోజుకు వెయ్యి చొప్పున నాలుగువేలు కట్టాల్సిందే అంటూ మేనేజ్ మెంట్ ప్రతినిధి దురుసుగా మాట్లాడటం మనకు ఈ ఆడియోలో కనిపిస్తోంది. పైగా ఇంకా లేట్ అయితే ఇంకా పెరుగుతూనే పోతుంది అని ఆమె చెప్పింది. దీన్ని బట్టి ఎంబీయూలో ఏ స్థాయిలో వసూళ్లు ఉంటున్నాయనేది తేలిపోతోంది. ఇంకో ఆడియోలో విద్యార్థి తండ్రి రెండు రోజులకే రెండు వేలు ఫైన్ వేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మరీ ఇంత దారుణంగా ఫైన్లు వేయడం ఏంటని అడిగితే.. కచ్చితంగా కట్టాలి లేదంటే సప్లిమెంటరీ రాసుకోవాల్సిందే అన్నట్టు మేనేజ్ మెంట్ ప్రతినిధులు మాట్లాడటం దారుణంగా కనిపిస్తోంది.

మిగతా యూనివర్సిటీల్లో కూడా వసూలు చేస్తున్నారని.. అందుకే తాము ఇష్టారీతిన చేస్తున్నట్టు ఓపెన్ గానే చెబుతున్నారు. మరి వాళ్లు చెప్పినట్టు మిగతా యూనివర్సిటీల్లో ఉంటే ఈ పాటికే ఫిర్యాదులు వచ్చేవి కదా.. స్టూడెంట్ యూనియన్లు గొడవ చేసేవి కదా. కేవలం ఎంబీయూ మీదనే ఫిర్యాదులు వస్తున్నాయంటే వీళ్ల వసూళ్ల పర్వం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బీటెక్ స్టూడెంట్ల దగ్గరి నుంచి రూ.5వేల నుంచి రూ.45వేలు అదనంగా వసూలు చేస్తున్నారు. బీకాం, ఎంకామ్ స్టూడెంట్ల నుంచి రూ.18వేల నుంచి రూ.25వేల దాకా అదనంగా వసూలు చేస్తున్నారు. బీఫార్మసీ, ఫార్మాడీ విద్యార్థుల నుంచి రూ.25వేల నుంచి రూ.45 వేల దాకా అదనంగా వసూలు చేస్తున్నారు. ఇలా ప్రతి సంవత్సరం అంటే ఈ మూడేళ్లలోనే రూ.2.56 కోట్లు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇలా ప్రతి ఏడాది కోట్లలో అత్యధికంగా వసూలు చేసి విద్యార్థులను ఇబ్బంది పెడుతోందని ఎంబీయూపై ఆరోపణలు వస్తున్నాయి.


Tags

Next Story