TTD : కల్తీనెయ్యి కేసులో సంచలన నిజాలు.. వైవీ సుబ్బారెడ్డి పాత్ర ఏంటి..?

TTD :  కల్తీనెయ్యి కేసులో సంచలన నిజాలు.. వైవీ సుబ్బారెడ్డి పాత్ర ఏంటి..?
X

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదమైన శ్రీవారి లడ్డూ దేశవ్యాప్తంగా ఎంతో పవిత్రత ఉన్నది. అలాంటి లడ్డూను కల్తీ చేసింది వైసీపీ. సిట్ విచారణలో తాజాగా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. రూ.251 కోట్ల విలువైన లడ్డూల తయారీకి సంబంధించి ఇచ్చిన టెండర్‌లో పాలు, వెన్న, స్వచ్ఛ నెయ్యి లేవని, వాటి స్థానంలో సబ్బులు, పెయింట్ తయారీలో వాడే కెమికల్స్‌తో నెయ్యి తయారు చేశారని బయటపడింది. భోళే బాబా ఆర్గానిక్ నెయ్యి కంపెనీ ఈ నకిలీ నెయ్యి సరఫరా చేసింది. ఈ విషయాన్ని అజయ్ సుగంధ్ బయట పెట్టాడు. ఆయన చెప్పినదాని ప్రకారం.. నెయ్యి పేరుతో సరఫరా చేసింది కంప్లీట్ గా కెమికల్ మిశ్రమం. దానిలో తినడానికి అనుకూలంగా ఉండేవీ ఏవీ లేవంట.

ఇక ఈ కేసులో మరో కీలక అంశం బయటకు వచ్చింది. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, అజయ్ సుగంధ్‌ను వ్యక్తిగతంగా కలిసినట్టు సిట్ విచారణలో బయటపడింది. వీళ్లిద్దరూ ఎందుకు కలిశారు.. దాని వెనక ఉద్దేశ్యం ఏమిటి? అనే ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో టిటిడి లడ్డూ తయారీ, నాణ్యత నియంత్రణ వ్యవస్థలపై పెద్ద ప్రశ్నలే తలెత్తాయి. భక్తులు ఇంతకాలం భక్తిశ్రద్ధలతో స్వీకరిస్తున్న ప్రసాదం వెనక ఇలాంటి మోసాలు జరుగుతున్నాయంటే, దర్యాప్తు మరింత లోతుగా సాగాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ లడ్డూ తయారీకి వాడిన నెయ్యి క్వాలిటీగా లేదని 2022లోనే టెస్టుల్లో తేలితే.. ఈ భోళే బాబా కంపెనీ తప్పుకుంది. వేరే కంపెనీని ముందు ఉంచి ఈ భోళే బాబీ కంపెనీనే కల్తీ నెయ్యిని సరఫరా చేసింది. అంటే ఎంత దారుణంగా ఆలోచించారో ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. హిందూ భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేశారంటే ఎంతటి మహాపాపం చేశారో అర్థం చేసుకోవచ్చు. దేవుడి ప్రసాదం విషయంలోనే వీళ్లు ఇంతకు తెగించారంటే.. ఇక సామాన్య ప్రజల విషయంలో వీళ్ల అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.


Tags

Next Story