లిక్కర్ కేసులో అంతిమ లబ్ధిదారుడిని పట్టేస్తారా..?

లిక్కర్ స్కాంలో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మొన్న విజయసాయిరెడ్డిని ఈడీ బృందం విచారించింది. ఇందులో అన్ని విషయాలను విజయసాయిరెడ్డి బయటపెట్టేశారు. అసలు లిక్కర్ పాలసీ ఎలా తెచ్చారు, ఎవరికోసం తెచ్చారు, ఎవరు చెబితే తెచ్చారు అనేవి మొత్తం కూలంకుషంగా వివరించారు. తాను జగన్ కోసం 15 ఏళ్లు కష్టపడి పంట పండిస్తే.. కోటరీ లో ఉన్న వాళ్ళు వచ్చి పందికొక్కుల్లా తినేశారు అంటూ ఆరోపించాడు. మిథున్ రెడ్డి చెబితేనే తాను లిక్కర్ పాలసీ కోసం చర్చలు జరిపానని.. 100 కోట్ల లోన్ కూడా ఏర్పాటు చేశాను అంటూ తెలిపారు విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి నుంచి ఇతర కీలక ఆధారాలను ఈడి సేకరించింది. ఈ కేసులో బ్లాక్ మనీని వైట్ ఎలా చేశారో.. అవి ఎలా చేతులు మారాయో కూడా ఆధారాలను సేకరించారు ఈడీ అధికారులు.
విజయసాయిరెడ్డి ఇచ్చిన వివరాల ఆధారంగా మిథున్ రెడ్డిని ఈడి ప్రశ్నించింది. విజయసాయిరెడ్డి ఇచ్చిన స్టేట్ మెంట్ ను ముందు ఉంచి మిథున్ రెడ్డి అనివార్యంగా సమాధానాలను చెప్పేలా ఏడి ప్లాన్ చేసింది. దీంతో ఈ కేసులు అంతిమల్ అబ్బిదారుడు గురించి కూడా ఈడీకి కొన్ని విషయాలు తెలిసినట్టు సమాచారం. లిక్కర్ కేసులో అంతిమంగా డబ్బులు ఎవరికి వెళ్ళాయి ఎలా వెళ్లాలి అనే విషయాలను ఈడి కొన్ని లింకులను కనిపెట్టినట్టు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో నెంబర్ 2 గా వ్యవహరించిన విజయసాయిరెడ్డి ఈ కేసులో మిగతా వాళ్ళు చెప్పిన దానికంటే డిఫరెంట్ గా మాట్లాడి అన్ని విషయాలను బయటపెట్టినట్లు సమాచారం.
అందుకే మొన్న ఆగమేఘాల మీద మాజీ సీఎం జగన్ బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి కూటమి మీద ఒక పసలేని ఆరోపణ చేశారు. మీడియాలో అటు సోషల్ మీడియాలో విజయసాయిరెడ్డి హైలెట్ కాబోదు అనే ఉద్దేశంతోనే జగన్ ఇలా మాట్లాడినట్టు అందరికీ తెలిసిపోయింది. కానీ వైసీపీ నేతలు భయపడుతున్నట్టు ఈ కేసులో అంతిమలబిదారుడిని త్వరలోనే బయటపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఏపీ రాజకీయాల్లో ఒక సంచలన నిజం ప్రజలకు తెలిసే అవకాశం ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
