AP : వైజాగ్ డైనోసార్ పార్క్ లో ఘోర అగ్నిప్రమాదం.. 10 రోజుల్లో 3 ఘటనలు

విశాఖపట్నంలోని డైనోసార్ పార్క్ లో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచే సుకుంది. ఆర్కే బీచ్ రోడ్ లో ఉన్న ఈ పార్క్ లో మంటలు ఎగసిపడుతున్నాయి. భారీగా పొగ వెలు వడుతుండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ప్రమాదంపై స్థానికులు సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేందుకు కృషి చేస్తున్నారు. పెద్ద ఎత్తున మంటలు, పొగ ఎగసి పడుతుండడంతో రోడ్డుపై ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోంది.
గత పది రోజుల్లో విశాఖలో మూడు అగ్ని ప్రమాద ఘటనలు జరిగాయి. ఈ నెల 4వ తేదీన విశాఖ రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న రైలులో బోగీలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. గత ఆదివారం సెవెన్ హిల్స్ ఆస్పత్రిలోనూ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని తేలింది. వరుస అగ్ని ప్రమాద ఘటనలు జరుగుతుండడంతో నగరవాసుల్లో ఆందోళన నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com