visakhapatnam : విశాఖ జిల్లాలో దారుణం.. మైనర్ బాలికపై లైంగిక దాడి

X
By - TV5 Digital Team |21 Jan 2022 2:30 PM IST
visakhapatnam : విశాఖ జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో దారుణం చోటుచేసుకుంది.
visakhapatnam : విశాఖ జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో దారుణం చోటుచేసుకుంది. స్కూలు నుంచి వస్తున్న మైనర్ బాలికపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిన్న సాయంత్రం సూల్ వదిలిన తర్వాత ఇంటికి వస్తున్న 11 ఏళ్ల బాలికను... అదే గ్రామానికి చెందిన 21 ఏళ్ల గొడ్డు నగేష్ అనే యువకుడు అడ్డుకొని బాలికను జీడితోటల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. రాత్రి 9 గంటలకు బాలికను వదిలిపెట్టాడు. ఈ విషయం ఎవరికైనా చెపితే చంపేస్తానంటూ బాలికను బెదిరించాడు. రాత్రిఇంటికి చేరుకున్న మైనర్ బాలిక జరిగిన విషయాన్ని తల్లితండ్రులకు చెప్పడంతో .. వారు నక్కపల్లి పోలీసులకు ఫిర్యాదుచేశారు. కామాంధుడిని కఠినంగా శిక్షించాలంటూ వారు డిమాండ్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com