AP : బస్సులో షర్మిల జర్నీ.. ఉచితం లేదంటూ ఆగ్రహం

AP : బస్సులో షర్మిల జర్నీ.. ఉచితం లేదంటూ ఆగ్రహం
X

మహిళలకు ఉచిత బస్సు పథకం ఎక్కడా అంటూ ఏపీపీసీసీ చీఫ్‌ షర్మిల ప్రశ్నించారు. విజయవాడ బస్టాండ్‌ నుంచి తెనాలికి బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆమె మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్‌ చేశారు. బస్సులో టిక్కెట్‌ కొనుక్కున్న షర్మిల ఉచితం ఎప్పుడిస్తారంటూ కూటమి సర్కార్‌ను ప్రశ్నించారు. ఉచిత ప్రయాణం అమలు చేయాలని చంద్రబాబుకి పోస్టు కార్డు రాశారు. తెలంగాణలో వారం రోజుల్లోనే ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేశారని… నాలుగు నెలలైనా కూటమి ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.

పథకం అమలు చేయడానికి ఇబ్బందులు ఏమిటని నిలదీశారు. ఇదేళ్లు ఇలానే కాలయాపన చేస్తారా అంటూ సెటైర్లు వేశారు. అదే విధంగా మహిళల కోసం పెట్టిన పథకాలు వెంటనే అమలు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు

Tags

Next Story