SHARMILA: ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌గా నేడు షర్మిల బాధ్యతల స్వీకరణ

SHARMILA: ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌గా నేడు షర్మిల బాధ్యతల స్వీకరణ
ఇప్పటికే ప్రారంభమైన చేరికలు.... రాహుల్‌ను ప్రధానిని చేయడమే లక్ష్యమన్న షర్మిల

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల నేడు బాధ్యతలు స్వీకరిస్తారు. విజయవాడలో షర్మిల బాధ్యతల స్వీకరిస్తారు. విజయవాడ ఆహ్వానం కళ్యాణ మండపంలో పీసీసీ చీఫ్‌ బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారని రుద్రరాజు తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే రాజశేఖర్ రెడ్డి కలను నెరవేర్చడానికే కాంగ్రెస్ పార్టీలో చేరానని ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ఇవాళపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకోవడానికి ముందు ఇడుపులపాయలో తన తండ్రి సమాధి వద్ద ఆమె నివాళులు అర్పించారు. షర్మిల తో పాటు కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి తో కలిసి వచ్చిన షర్మిలకు కడప విమానాశ్రయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా స్వాగతం పలికారు. కడప నుంచి రోడ్డు మార్గం ద్వారా ఇడుపులపాయకు దాదాపు 100 వాహనాల్లో కాన్వాయ్ రాగా అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు. వేంపల్లిలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఇడుపులపాయ ఘాటు వద్దకు చేరుకున్న షర్మిల ప్రత్యేక ప్రార్థనలు చేసి తండ్రి సమాధి వద్ద నివాళులర్పించారు. దేశంలోనే సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ అని ఆ పార్టీ సిద్ధాంతాలను కొనసాగించడానికి చివరి వరకు కృషి చేస్తానని తేల్చి చెప్పారు. ఇడుపులపాయలో షర్మిల సమక్షంలోనే మాజీ మంత్రి అహమదుల్లా కాంగ్రెస్ పార్టీలో చేరారు.


తండ్రి మాట కోసం నిలబడింది

తండ్రి మాట కోసం నిలబడిన వ్యక్తి వైఎస్ షర్మిలఅని కేవీపీ రామచంద్రరావు ( KVP అన్నారు. వైఎస్ కుటుంబంతో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని.. వైఎస్సార్, షర్మిళ ఒకే బాటలో నడవడం ఆనందదాయకమని చెప్పారు. రాజకీయ విభేదాలు ఉన్నా సాన్నిహిత్యం వీడలేదన్నారు. షర్మిల తనకు మేన కోడలు మాత్రమే కాదని.. కూతురుతో సమానమన్నారు. కాంగ్రెస్‌కి దిక్సూచిగా షర్మిల నిలబడి దేశంలో అగ్రగామిగా నిలబెట్టిన రాజశేఖర్ రెడ్డి బిడ్డని అందరూ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్సార్ అభిమానులు షర్మిలకు అండగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం షర్మిలతో సాధ్యం అవుతుందని కేవీపీ రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు.


చేరికలూ షురూ

షర్మిల సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో చేరికల బోణి మొదలైంది. కడపకు చెందిన మాజీమంత్రి అహ్మదుల్లా వై.ఎస్ షర్మిల సమక్షంలో ఆ పార్టీలో చేరారు. అహ్మదుల్లాకు పార్టీ కండువా వేసి పార్టీలోకి షర్మిల ఆహ్వానించారు. కాంగ్రెస్‌లో అహ్మదుల్లా మున్సిపల్ చైర్మెన్‌గా పనిచేశారు. 2004, 2009లో కడప ఎమ్మెల్యేగా గెలుపొంది దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో మైనార్టీ సంక్షేమశాఖ మంత్రిగా పని చేశారు. అహ్మదుల్లా తండ్రి దివంగత రహమతుల్లా పి.సి.సి అధ్యక్షులుగా, రాజ్యసభ సభ్యులుగా పని చేశారు. అహ్మదుల్లా రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి నమ్మిన బంటుగా ఉన్నారు. రాష్ర్ట విభజన అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నారు. తాజాగా షర్మిల సమక్షంలో కాంగ్రెస్ తీర్చం పుచ్చుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story