YS Jagan : కుట్రపూరితంగానే టార్చర్.. సునీల్ నాయక్ పొంతనలేని ఆన్సర్లు.

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘరామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్, అప్పటి ఐజీ అయిన సునీల్ నాయక్ లను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సునీల్ నాయక్ ను ఐపీఎస్ దామోదర్ బృందం విచారిస్తోంది. పోలీసులు కస్టడీలో ఉన్న సునీల్ నాయక్.. నాలుగో రోజు పొంతనలేని సమాధానాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. రఘురామ కృష్ణం రాజుపై అప్పట్లో ఉదయం 9.30 గంటలకు ఎఫ్ ఐఆర్ నమోదైతే.. ఉదయం 8.30 గంటలకే హైదరాబాద్ ఎందుకు వెళ్లారని పోలీసు ఉన్నతాధికారులు ప్రశ్నించారు. ఆ విషయంలో గతంలోనే పోలీస్ సిబ్బంది ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ప్రశ్నలు అడిగితే సునీల్ నాయక్ నీళ్లు నమిలినట్టు తెలుస్తోంది.
ఇది కుట్ర పూరితంగా చేసిన పని కాదా అని దామోదర్ బృందం ప్రశ్నిస్తే.. ఏమో నాకు తెలియదు అని దాటవేసేందుకు ప్రయత్నిస్తున్నారు సునీల్ నాయక్. ఒకవేళ సునీల్ నిజంగానే తప్పు చేయకపోయి ఉంటే సూటిగా సమాధానాలు ఇచ్చేవారు కదా. అలా చేయకుండా తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా అని సినిమా డైలాగులు కొట్టడం దేనికి అంటున్నారు ఏపీ ప్రజలు. ఇదంతా చూస్తుంటే సునీల్ నాయక్ ఇందులో కీలకంగా వ్యవహరించినట్టే అందరికీ అర్థం అయిపోతోంది.
ఈ నెల 9 అంటే నేటితో సునీల్ నాయక్ కస్టడీ ముగిసే ఛాన్స్ ఉంది. కానీ పూర్తి స్థాయిలో నిజా నిజాలు రాబట్టేందుకు పోలీసులు మరోసారి ఆయన్ను అదుపులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. వైఎస్ జగన్ హయాంలో ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి ప్రత్యర్థి పార్టీల నాయకులను ఇబ్బంది పెట్టారు సునీల్ నాయక్. ఆయన మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి. మరి నిజాలు ఒప్పుకుంటారా లేదా అనేది చూడాలి.
Tags
- Raghu Rama Krishna Raju custodial torture case
- YS Jagan Mohan Reddy government controversy
- Sunil Naik investigation
- CID Sunil Kumar arrest
- IPS Damodar inquiry
- Andhra Pradesh political news
- YSRCP controversy
- AP police investigation
- custodial torture case AP
- RRR case updates
- Andhra politics latest news
- YSRCP leaders controversy
- AP police custody interrogation
- Andhra Pradesh News
- Latest Telugu News
- TV5 News
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
