IT RAIDS: రూ.300 కిలోల బంగారం సీజ్‌

IT RAIDS: రూ.300 కిలోల బంగారం సీజ్‌
పొద్దుటూరులో ఐటీ శాఖ సోదాలు... రూ. 200 కోట్ల విలువైన బంగారం సీజ్‌

ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ శాఖ తనిఖీలు కలకలం రేపాయి. YSR జిల్లా పొద్దుటూరులో గోల్డ్‌ షాపుల్లో జరిపిన దాడుల్లో ఐటీ శాఖ భారీగా బంగారం స్వాధీనం చేసుకుంది. దాదాపు 200కోట్ల రూపాయల విలువ చేసే 300 కిలోల బంగారు ఆభరణాలను సీజ్ చేసి తిరుపతికి తరలించారు. ప్రొద్దుటూరులో బంగారు వ్యాపారస్తులపై ఐటీశాఖ జరిపిన దాడులు కలకలం రేగాయి. బంగారం వ్యాపారానికి రెండో ముంబయిగా పేరొందిన ప్రొద్దుటూరులో దాదాపు 100 మంది ఐటీశాఖ అధికారులు బృందాలుగా విడిపోయి నాలుగు ప్రముఖ జ్యువెలరీ దుకాణాలపై సోదాలు కొనసాగించారు. భూశెట్టి జ్యువెలర్స్, గురు రాఘవేంద్ర జువెలర్స్, తల్లం జువెలర్స్, డైమండ్ జ్యువెలర్స్ దుకాణాలపై ఐటీ శాఖ అధికారులు 4రోజులపాటు తనిఖీలు నిర్వహించారు.


గత పదేళ్ల క్రయవిక్రయాలను పరిశీలించారు. ఐటీ శాఖకు పన్నులు చెల్లించకుండా అక్రమ పద్ధతిలో బంగారు ఆభరణాలు విక్రయించారన్న ప్రధాన ఆరోపణపై ఐటీశాఖ దాడులు నిర్వహించింది. ఈ తనిఖీలు నిర్వహించడానికి రెండు రోజులు ముందుగానే సాధారణ వినియోగదారుల తరహాలో ఈ నాలుగు ప్రముఖ బంగారు దుకాణాల్లోకి వెళ్లి బంగారాభరణాలను కొనుగోలు చేశారు. వారు ఏ విధంగా తూకం వేస్తున్నారు..బిల్లులు ఏ విధంగా మంజూరు చేస్తున్నారో టాక్స్‌ ఎలా చెల్లిస్తున్నారనేది క్షుణ్ణంగా పరిశీలించారు.నాలుగు రోజుల పాటు నిర్వహించిన సోదాల్లో... విజయవాడ, తిరుపతికి చెందిన ఐటీ శాఖ అధికారులు పాల్గొన్నారు. దాదాపు 300 కిలోల బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. ఎలాంటి బిల్లులు లేకుండా దుకాణాల్లో విక్రయానికి పెట్టుకోవడంపై వాటన్నిటినీ ఐటి శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటన్నింటిని సూట్ కేసుల్లో భద్రపరిచి సంబంధిత యజమానులతో సంతకాలు తీసుకొని వాహనాల్లో 300 కిలోల బంగారు ఆభరణాలను తిరుపతిలోని ఐటీశాఖ కార్యాలయానికి తరలించారు. వాటి విలువ దాదాపు 200కోట్ల రూపాయలు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

బంగారు దుకాణాలపై దాడులతో ప్రొద్దుటూలులో ఉన్న స్వర్ణకారుల దుకాణాలు మూతపడ్డాయి. నాలుగు రోజుల నుంచి దుకాణాలు తెరుచుకోక పోవడంతో దసరా సందర్భంగా అనేకమంది ప్రజలు బంగారు కొనుగోలు చేయడానికి వచ్చి నిరాశగా వెనుతిరిగి వెళ్లారు. నాలుగు రోజులు పాటు ఐటీ శాఖ అధికారులు ప్రొద్దుటూరులోని మకాం వేయడంతో బంగారు వ్యాపారస్తులు అందరూ ఆందోళన గురయ్యారు. దసరా శరన్నవరాత్రులు సందర్భంగా అమ్మవారి శాల ఊరేగింపు ఉత్సవాలు కూడా ప్రముఖ బంగారు వ్యాపారస్తులే దగ్గరుండి చూసుకునే ఆనవాయితీ ప్రతి ఏటా వస్తుంది. అయితే ఈసారి పండగ వేల ఐటీ శాఖ అధికారులు ఈ విధంగా దాడులు చేయడంపై వ్యాపారస్తులు కలకలం మొదలైంది. మరోసారి కూడా వచ్చి తనిఖీలు చేస్తామని ఐటి శాఖ అధికారులు చెప్పి వెళ్లినట్లు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story