Shyamala : శ్యామల వద్దు అంటున్న వైసీపీ మహిళా నేతలు..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో శ్యామల ధోరణి వల్ల కొత్త ధోరణి కనిపిస్తోంది. పార్టీ నాయకత్వంలో శ్యామల ప్రెస్ మీట్స్, ఇతర కార్యక్రమాల వల్ల వైసీపీ లో ఆమెకు ప్రాధాన్యత పెరుగుతోంది. దీంతో మాజీ మంత్రులు రోజా, రజినీకి తీవ్ర ఆవేదన కలిగించిందని అంటున్నారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి కోసం ఎవరిని పడితే వారిని ఘాటుగా తిట్టడంలో రోజా, రజినీ ముందంజలో ఉన్నారు. అయితే, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో వీరి ప్రభావం గణనీయంగా తగ్గింది. జగన్ కోసం బూతులు తిట్టి ఓడిపోయారు వీరిద్దరూ. కానీ ఇప్పుడు వారికి ఎలాంటి ఆదరణ లేదు జగన్ నుంచి. ఇప్పుడు పార్టీలో వారి ప్రభావాన్ని తగ్గించేశారు జగన్.
శ్యామలనే ప్రతిసారి ప్రెస్ మీట్లు పెడుతూ హైలెట్ అవుతోంది. జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రత్యేకంగా శ్యామలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. వైసీపీ లో ప్రతి ప్రెస్ మీట్స్‌లో శ్యామలకే ప్రియారిటీ ఇస్తున్నారు. వైసీపీ మీడియా, సోషల్ మీడియా విభాగాలు శ్యామల హైలైట్ పై ఎక్కువ శ్రద్ధ పెట్టడం, రోజా, రజినీ వంటి ఇతర నాయకులకు అసంతృప్తిని కలిగిస్తోంది. పార్టీలో తమ స్థానం తగ్గినందుకు వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వైసీపీ లో శ్యామలను పార్టీలో కీలక స్థానంలో కొనసాగించాలని, పార్టీ కార్యకలాపాల్లో మరింత ప్రభావాన్ని ఇవ్వాలని చర్చలు జరుగుతున్నాయి.
నాయకత్వంలో కొత్త మహిళా నేతల ప్రాధాన్యత, పార్టీ వ్యూహాలు, మీడియా ప్రాధాన్యతలు మార్చడం వంటి కారణాల వల్ల, మాజీ మంత్రులు రోజా, రజినీ అధిష్టానం మీద అలక బూనినట్టు తెలుస్తోంది. తాము పార్టీ కోసం ఇంత చేస్తే కనీసం పట్టించుకోవట్లేదని.. శ్యామలకు అంత ప్రాధాన్యత ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారు. వీలైనంత త్వరగా శ్యామలను పార్టీ నుంచి సాగనంపాలని డిమాండ్ చేస్తున్నారు రోజా, రజినీ లాంటి మహిళా నేతలు. ఇంకొంత మంది శ్యామలను కొనసాగించాలి అంటున్నారు. దీంతో వైసీపీలో శ్యామల చిచ్చు రాజేసినట్టు అయింది.
Tags
- YSR Congress Party
- YSRCP internal politics
- Shyamala YSRCP
- Shyamala press meets
- Jagan Mohan Reddy
- Roza YSRCP
- Rajini YSRCP
- former ministers Roza Rajini
- YSRCP women leaders
- YSRCP leadership crisis
- party infighting
- political controversy YSRCP
- YSRCP media strategy
- Shyamala controversy
- YSRCP power shift
- Jagan priorities
- YSRCP factionalism
- Andhra Pradesh politics
- YSRCP latest news
- YSRCP women leaders clash
- Andhra Pradesh News
- Latest Telugu News
- TV5 News
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

