YS Jagan : ఆ కేసులపై నోరు మెదపని జగన్.. ఒప్పేసుకుంటున్నారా..!

జగన్ ప్రభుత్వంలో చేసిన అరాచకాలకు అదుపు, హద్దు అనేవే లేవు. తవ్వినా కొద్దీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అయితే వరుస కేసులు వైసీపీ నేతలను చుట్టుముడుతున్నా సరే జగన్ మాత్రం ఇంకా సైలెంట్ గానే ఉంటున్నారు. ఎన్ని అక్రమ కేసుల్లో వైసీపీ నేతలు దొరికిపోతున్నా సరే వాటిపై కనీసం నోరు మెదపట్లేదు. రఘురామ కృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఇప్పటికే సునీల్ నాయక్ కస్టడీ ముగిసింది. అన్నీ పొంతనలేని సమాధానలు చెప్పేస్తున్నారు సునీల్ నాయక్. అయితే ఈ కేసులో జగన్ ఆదేశాలతోనే టార్చర్ చేశారనే విషయాలు బయటకు వస్తున్నాయి. కానీ జగన్ మాత్రం ఈ కేసును కన్నెత్తి చూడట్లేదు. తనకేం సంబంధం లేదన్నట్టు మౌనంగానే ఉంటున్నారు. అలాగే లిక్కర్ కేసులో ఈడీ ఎంట్రీ అయితే దానిపై సైలెంట్ అయిపోయారు. అటు కల్తీ నెయ్యి కేసులో ఏకసభ్య విచారణ జరుగుతోంది. ఇంకోవైపు కల్తీ లిక్కర్ కేసులో వైసీపీ నేతలు అరెస్ట్ అవుతున్నారు.
ఇంకోవైపు వైసీపీ నేత అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో పరారీలో ఉన్నాడు. ఇలా ఒక్కటా.. రెండా.. వైసీపీ హయాంలో చేయని అక్రమాలు లేవు. చేయని దారుణాలు లేవు. కానీ వాటన్నింటిలో కింది స్థాయి నేతలు. అధికారులే ఇప్పటి దాకా అరెస్ట్ అవుతున్నారు. ఈ కేసుల్లో పూర్తి స్థాయి విచారణలు జరిగి.. అంతిమ లబ్దిదారుడి దాకా కేసులు వెళ్లడానికి సమయం పడుతుంది కాబట్టి.. అప్పటి దాకా తనకెందుకులే అన్నట్టు జగన్ సైలెంట్ గా ఉంటున్నారేమో అని వైసీపీలోనే పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
ఈ కేసుల్లో తనదాకా ఏమీ రావట్లేదు కదా అని జగన్ బహుషా సైలెంట్ గా ఉంటున్నారేమో అంటున్నారు కూటమి నేతలు. అయితే వైసీపీ నేతలు, జగన్ హయాంలో పనిచేసిన అధికారులు కేసుల్లో ఇరుక్కుంటే అది అంతిమంగా జగన్ ప్రభుత్వానికే మచ్చ తెస్తోంది కదా. మరి ఆ లెక్కన జగన్ కు కూడా ఇందులో పాత్ర ఉన్నట్టే కదా. ఇలా సైలెంట్ గా ఉంటే ఆ కేసుల్లో తన పాత్ర ఉన్నట్టు జగన్ ఒప్పేసుకుంటున్నారా అని పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
Tags
- YSRCP
- YS Jagan Mohan Reddy
- Andhra Pradesh Politics
- Raghu Rama Krishna Raju Custodial Torture Case
- Sunil Naik Case
- YSRCP Liquor Scam
- Adulterated Liquor Case AP
- Anantababu Driver Murder Case
- ED Investigation AP
- YSRCP Leaders Arrests
- Jagan Silence Controversy
- AP Political Debate
- Andhra Pradesh News
- Latest Telugu News
- TV5 News
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
