Chinna Appanna : కస్టడీలోకి చిన్నప్పన్న.. పేర్లు బయటపెడుతాడా..?

Chinna Appanna : కస్టడీలోకి చిన్నప్పన్న.. పేర్లు బయటపెడుతాడా..?
X

తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ దర్యాప్తులో వేగం పెరిగింది. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఎస్ చిన్న అప్పన్నను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో ఆయనను జైలు నుంచి ఆస్పత్రికి తరలించి ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన తరువాత సిట్ ఆఫీస్‌కు తీసుకువెళ్లారు. ఇక ముందు ఐదు రోజుల పాటు ఆయనను అధికారులు విస్తృతంగా విచారించనున్నారు. గత నెల జరిగిన అరెస్టు తర్వాత చిన్నప్పన్నను రిమాండ్‌కు పంపి నెల్లూరు జైలుకు తరలించారు. అయితే దర్యాప్తులో కీలక వివరాలు అవసరమని సిట్ అధికారులు భావించి కస్టడీ పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు ఆ అనుమతి మంజూరు చేసింది.

చిన్నప్పన్న నుంచి వచ్చే సమాచారం ఈ కేసు దిశను పూర్తిగా మార్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఆయన ఈ కేసులో చాలా కీలకంగా వ్యవహరించారు. కాబట్టి విచారణ ద్వారా కొందరు కీలక నేతల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే, ఈ నెల 19న వైవీ సుబ్బారెడ్డిపై విచారణ కూడా జరగనుండటంతో కేసుపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. చిన్నప్పన్న బ్యాంకులో భారీగా డబ్బులు ఉన్నట్టు ఇప్పటికే పోలీసులు గుర్తించారు.

టీటీడీకి నెయ్యి టెండర్లు ఇప్పించడం, ఫేక్ కంపెనీలను తీసుకురావడం, వ్యవస్థను మేనేజ్ చేయడంలో చిన్నప్పన్న చాలా కీలకంగా వ్యవహరించారు. ఎలాంటి ఆస్తులు లేని చిన్నప్పన్న.. టీటీడీకీ వైవీ సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్న టైమ్ లోనే కోట్ల ఆస్తులు సంపాదించాడు. దీనికి కారణం ఆయన చేసిన ఈ అవినీతి పని అని ఇప్పటికే తేలిపోయింది. కాకపోతే చిన్నప్పన్న ఇంకా కీలక నేతలు పేర్లు బయట పెట్టలేదు. ఐదు రోజుల విచారణలో ఆయన ఎవరి పేర్లు చెప్పినా సరే అదో సంచలనమే అవుతుంది.

Tags

Next Story