AP Liquor Scam : లిక్కర్ కేసులో సిట్ దూకుడు.. రెండో ఛార్జ్‌షీట్ దాఖలు

AP Liquor Scam : లిక్కర్ కేసులో సిట్ దూకుడు.. రెండో ఛార్జ్‌షీట్ దాఖలు
X

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. తాజాగా ఏసీబీ కోర్టులో 200 పేజీలతో రెండో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జ్‌షీట్‌లో ముగ్గురు నిందితుల పాత్రపై కీలక ఆధారాలను సిట్ పొందుపరిచింది. బాలాజీ గోవిందప్ప, ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి పాత్రలను ఛార్జ్‌షీట్‌లో క్లుప్తంగా వివరించింది. ఈ ముగ్గురి కాల్ డేటా రికార్డు, గూగుల్ టేకౌట్, ల్యాప్ టాప్‌లోని డీటేయిల్స్‌ను ఛార్జ్‌షీట్‌లో సిట్ పొందుపరిచింది. లిక్కర్ పాలసీ తయారీలో ధనుంజయ్ రెడ్డి అడుగడుగునా జోక్యం చేసుకున్నారని కోర్టుకు అధికారులు తెలిపారు. ముడుపులు ఎవరెవరి వద్ద నుంచి ఎంత తీసుకున్నారు? అనే వివరాలను వెల్లడించారు. లిక్కర్ సిండికేట్ సమావేశాలకు ధనుంజయ్ రెడ్డి పలుసార్లు హాజరైనట్లు గూగుల్ టేకౌట్ సాక్ష్యాలను అటాచ్ చేశారు. బినామీ పేర్లతో పెట్టుబడులు కూడా పెట్టారని సిట్ అధికారులు తేల్చారు. కాగా ఇప్పటికే 305 పేజీలతో సిట్ అధికారులు తొలి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.

Tags

Next Story