Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం.. ప్రయాణికులను ఢీకొన్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్..

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం.. ప్రయాణికులను ఢీకొన్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్..
Srikakulam: శ్రీకాకుళం జిల్లా జి.సిగడాంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

Srikakulam: శ్రీకాకుళం జిల్లా జి.సిగడాంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఢీకొని ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. బాతువ రైల్వే గేట్ సమీపంలో సికింద్రాబాద్ నుంచి గౌహతి వెళ్తున్న సూపర్ ఫాస్ట్ రైలు సాంకేతిక కారణాలతో గేటు వద్దే నిలిచిపోయింది. ఈ క్రమంలో రైలులోని జనరల్ బోగీలో ఉన్న కొందరు ప్రయాణికులు కిందకు దిగి పట్టాలకు సమీపంలోకి వెళ్లారు..

ఈ సమయంలోనే భువనేశ్వర్ నుంచి ముంబై వెళుతున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్... వేగంగా ఢీకొనడంతో ఆరుగురు ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. ఘటనా స్థలంలో పలువురి మృతదేహాలు ఛిద్రమై రైలు పట్టాలకు దూరంగా పడిపోయాయి. ఘటన సమయంలో అరుపులు కేకలు భారీగా వినిపించినట్లు స్థానికులు తెలిపారు. కాగా, జి.సిగడాం - చీపురుపల్లి మధ్య జరిగిన రైలు ప్రమాదంపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ వేగంగా స్పందించారు.

ఆర్డీఓ, తహసీల్దార్‌ను ప్రమాద స్థలానికి హుటాహుటిన వెళ్లాలని ఆదేశించారు. అలాగే వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసిన కలెక్టర్...అంబులెన్స్ ను ఘటన స్థలానికి పంపించారు. క్షతగాత్రులను ఆస్పత్రిలో పరామార్శించారు కలెక్టర్. రైలు ప్రమాద ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడ్డ వారికి సరైన వైద్య సేవలు అందేలా చూడాలని సీఎంఓనుంచి అధికారులకు వెళ్లాయి. మరణించిన వారి కుటుంబాలకు అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందించాలని అధికారులను సూచించారు

Tags

Read MoreRead Less
Next Story