"స్కిల్" కేసులో చంద్రబాబుకు క్లీన్ చిట్.. వాళ్ల సంగతేంటి..?

స్కిల్ కేసులో చంద్రబాబుకు క్లీన్ చిట్.. వాళ్ల సంగతేంటి..?
X

వైసిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కుట్రలు చేసి చంద్రబాబు నాయుడు మీద స్కిల్ డెవలప్మెంట్ అంటూ ఓ తప్పుడు కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏసీబీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసుతో చంద్రబాబు నాయుడుతో సహా 37 మందికి ఎలాంటి సంబంధం లేదని.. ఇందులో ఎలాంటి అక్రమాలు జరిగినట్టు సాక్షాలు లేవు అంటూ కేసును కొట్టేసింది కోర్టు. దీంతో వైసీపీకి మైండ్ బ్లాంక్ అయిపోయింది. చంద్రబాబు నాయుడును కుట్రపూరితంగా జైల్లో వేయాలని.. జగన్ ఈ కేసు పెట్టించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడును అరెస్టు చేసినప్పుడు కూడా ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు కూడా లేదు. కానీ తప్పుడు వాదనలు చేసి చంద్రబాబును కుట్రపూరితంగా జైల్లో పెట్టారు. కానీ నిజం నిప్పులాంటిది కదా. అందుకే ఇన్ని రోజులకు అయినా సరే బయటపడింది. జగన్ బ్యాచ్ చేసిన కుట్రలు మొత్తం బట్టబయలు అయ్యాయి. ఇందులో ఒక్క సాక్షాన్ని కూడా చూపించలేకపోయారు. టిడిపికి వచ్చిన విరాళాలను పరిశీలించిన సరే అందులో ఎలాంటి తప్పులు లేవు అని తేలిపోయింది.

చంద్రబాబు నాయుడును అరెస్టు చేసినప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో 371 కోట్లు అవినీతి జరిగిందని.. వాటిని చంద్రబాబు నాయుడు తన బినామీలకు షెల్ కంపెనీల ద్వారా మళ్ళించారు అంటూ వైసీపీ ఊరు, వాడ ప్రచారం చేసింది. చంద్రబాబు నాయుడు మీద లేనిపోని తప్పుడు ఆరోపణలు చేసింది. ఆయన ఇమేజ్ ను దెబ్బతీయడానికి కుట్రలు చేసింది. మరి ఇప్పుడు కేసు క్లోజ్ అయింది కాబట్టి.. చంద్రబాబు నాయుడు మీద కుట్రలు చేసిన వారిని వదిలిపెడతారా అనే ప్రచారం మొదలైంది. ఎందుకంటే ఎలాంటి తప్పు చేయలేని వ్యక్తి మీద ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టడం కూడా నేరమే. వారికి కూడా శిక్షలు పడాలి కదా అంటున్నారు కూటమినేతలు. కోర్టు తీర్పులు రాకముందే.. అసలు విచారణ కూడా జరగకముందే వైసిపి నేతలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు తప్పు చేశారు అవినీతి చేశారు అంటూ తీర్పులు ఇచ్చేశారు. మరి వారిని కూడా చట్టబద్ధంగా శిక్షించాలి అంటున్నారు కూటమినేతలు.

నిప్పులాంటి మనిషి మీద నిందలు వేస్తే చివరకు ఏం జరుగుతుందో వైసీపీకి వచ్చిన 11 సీట్లే సాక్ష్యం అంటున్నారు కూటమినేతలు. జగన్ మీద నమోదైన అవినీతి కేసుల్లో ఇప్పటివరకు ఒక్కదాంట్లో కూడా క్లీన్ చీట్ రాలేదు. రోజురోజుకూ ఆ కేసుల్లో జగన్ అడ్డంగా దొరికిపోయేందుకు సాక్షాలు కూడా బయటపడుతున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు మీద ఇప్పటివరకు ఒక్క అవినీతి కేసు కూడా రాలేదు. కానీ వైసీపీ ఉద్దేశపూర్వకంగా ఒక కేసు పెడితే అందులో కూడా ఆయనకు క్లీన్ చీట్ వచ్చేసింది. దీన్నిబట్టి చంద్రబాబు నాయుడు ఎలాంటి మనిషి అనేది ఇట్టే తెలిసిపోతుంది. రాజకీయాల్లో విలువలు ఉండాలని చంద్రబాబునాయుడు పదే పదే చెబుతుంటారని.. ఆయన పాటిస్తున్నారు కాబట్టే పార్టీ లీడర్లు కూడా అలాగే ఉండాలి అంటూ ఆయన సూచిస్తారని కార్యకర్తలు అంటున్నారు.

Tags

Next Story