YS Jagan : ఇన్ని తప్పుడు ప్రచారాలా.. ఒక్కటైనా నిజం ఉందా జగన్..

వైసిపి తీరు ఎలా మారిపోయింది అంటే ఏ చిన్న ఘటన జరిగినా సరే దాన్ని కూటమి ప్రభుత్వానికి ఆపాదించేసి బురదజల్లేయడం పనిగా పెట్టుకుంది. బాధితులే తమకు పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని పదేపదే చెబుతున్నా సరే.. అబ్బే మీరలా చెప్పకూడదు మేం తప్పుడు ప్రచారం చేసుకుంటే మీరు సైలెంట్ గా ఉండండి అన్నట్టు వైసిపి తీరు తయారైంది. మొన్నటికి మొన్న మెడికల్ కాలేజీల పిపిపి విషయంలో వైసీపీ ఎంత రాద్ధాంతం చేసిందో చూశాం. ఏకంగా హైకోర్టు ఇందులో ఎలాంటి ఉత్తర్వులు ఇయ్యలేం అని తేల్చి చెప్పినా సరే వైసీపీకి బుద్ధి రాలేదు. దాని తర్వాత మొన్న గూగుల్ డేటా సెంటర్ పై ఇలాంటి విష ప్రచారమే చేసింది. గూగుల్ డేటా సెంటర్ ఒక గోడౌన్ అని వాచ్ మెన్ ఉద్యోగం తప్ప ఒక్క ఉద్యోగం రాదని రకరకాల తప్పుడు ప్రచారాలు చేసింది. చివరకు నేషనల్ మీడియా కూడా హైలెట్ చేయడంతో నాలుక కరచుకొని.. ఆ గొప్ప తనదే అంటూ జగన్ మళ్ళీ ఫ్లైట్ ఫిరాయించాడు.
మొన్న కందుకూరు ఘటనలోనూ ఇదే జరిగింది. కమ్మ కాపు కులం మధ్య చిచ్చు పెట్టేందుకు వైసిపి నానారకాల ప్రయత్నాలు చేసింది. చివరకు లక్ష్మీ నాయుడు కుటుంబం ఈ హత్య జరగడానికి కారణం ఆర్థిక తగాదాలే అని.. ఇందులో కులం ప్రస్తావన వద్దు అంటూ చెప్పడంతో వైసిపికి పెద్ద షాప్ తగిలింది. ఇప్పుడు గుంటూరు మహిళ శేషమ్మ ఆత్మహత్య విషయంలోనూ ఇలాంటి కుల రాజకీయం తెరపైకి తీసుకొచ్చింది. జనసేన, టిడిపి పార్టీలు కలిసి ఉండటం వైసిపి తట్టుకోలేకపోతోంది. ఆ రెండు పార్టీలు కలిసి ఉంటే తమకు ఎన్నటికీ అధికారం రాదని వైసిపి నేతలు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. శేషమ్మ ఆత్మహత్యకు టిడిపి నేతల వేధింపులే కారణమని.. కాపు మహిళను చంపేశారు అంటూ రెండు కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించారు. చివరకు శేషమ్మ కుటుంబం ఇందులో కులాల ప్రస్తావనలేదని.. తమ బంధువుల వేధింపుల వల్లే శేషమ్మ చనిపోయిందంటూ చెప్పడంతో వైసీపీకి మళ్ళీ ఘోరమైన ఎదురు దెబ్బ తగిలింది.
ఇప్పుడు మొంథా తుఫాన్ మీద కూడా ఇలాంటి తప్పుడు ప్రచారమే చేసింది వైసిపి. ముందు అసలు తుఫాన్ అనేది లేదని.. ఇదంతా కూటమి డబ్బా కొట్టుకోవడానికి చేస్తున్న ప్రచారం అంటూ వైసీపీ పోస్టులు పెట్టింది. చివరకు తుఫాన్ బీభత్సానికి తీర ప్రాంతం అల్ల కల్లోలం కావడంతో ప్లేటు తిప్పేసి.. కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదంటూ తప్పుడు ప్రచారానికి తెరతీసింది. అంటే ఫేక్ ప్రచారం చేయడానికి కూడా ఓ పద్ధతి అంటూ లేదు. నోటికి ఏది వస్తే అది మాట్లాడటం చివరకు అది తప్పు అని తెలుసుకుంటే ఇంకో తప్పుడు ప్రచారానికి తెర తీయడం.. ఇదంతా వైసీపీకి బాగా అలవాటు అయిపోయింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

