సీఎం జగన్.. తిరుమల ఆచారాలను గౌరవించాలి : మాజీ మంత్రి సోమిరెడ్డి

సీఎం జగన్.. తిరుమల ఆచారాలను గౌరవించాలి : మాజీ మంత్రి సోమిరెడ్డి

తిరుమలలో అన్యమతస్తుల డిక్లరేషన్, ఆలయాల్లో విగ్రహాల ధ్వంసంపై వైసీపీ నేతలు, మంత్రుల వ్యాఖ్యలను TDP తప్పుబట్టింది. సీఎం జగన్... వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మంచి మనస్సుతో తీసుకోవాలంటే అక్కడి ఆచారాలను గౌరవించాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచించారు. ఏపీలో హిందూ దేవాలయాల విషయంలో చోటుచేసుకుంటున్న కొన్ని పరిణామాలు దురదృష్టకరమన్నారు. వాటిని ప్రోత్సహించేలా కొందరు మంత్రులు మాట్లాడడంపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. తిరుమలలో అన్యమతస్తులు డిక్లరేషన్‌లో సంతకం పెట్టే సంప్రదాయం అనాదిగా వస్తోందన్నారు. అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్ కేసీ అబ్రహం కూడా డిక్లరేషన్‌లో సంతకం పెట్టారని ఆయన గుర్తుచేశారు.


Tags

Read MoreRead Less
Next Story