AP : ఎడ్యుకేషన్‌లో ఆంధ్రా నెంబర్ వన్‌గా ఉండాలి : స్పీకర్ చింతకాయల

AP : ఎడ్యుకేషన్‌లో ఆంధ్రా నెంబర్ వన్‌గా ఉండాలి : స్పీకర్ చింతకాయల
X

ఎడ్యుకేషన్‌లో ఆంధ్రా నెంబర్ వన్‌గా ఉండాలన్నది నా కోరికని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో నర్సీపట్నం యువకులుండాలని నర్సీపట్నం ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ప్రభుత్వం మంజూరు చేసిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం ప్రారంభించిన అనంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ సమక్షంలో ఈ పథకానికి రూపకల్పన చేసిన విషయాన్ని గుర్తుచేశారు.

ఈ పథకం పేరును ఆంధ్రా అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ పేరు మీద పెట్టినందుకు ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలోని 475 జూనియర్ కాలేజీలలో 1.48 లక్షల మంది విద్యార్థులు ఈ పథకంతో లబ్ధి పొందుతుండగా, పథకం నిర్వహణకు ఏడాదికి రూ. 85 కోట్ల వ్యయం అవసరమని తెలిపారు. ప్రారంభ దశలో ఇబ్బందులు ఉండవచ్చని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరు డిసెంబర్ 31 ని నూతన సంవత్సరంగా చెప్పుకుంటూ మద్యం సేవిస్తున్నారని రాబోయే రోజుల్లో ఉగాదిని తెలుగు పండుగ గా మనమందరం ఉత్సవాలు చేసుకోవాలని రాష్ట్రంలో ఉన్న 14వేల పంచాయితీల్లో ఈ కార్యక్రమం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కోరినట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు.

Tags

Next Story