LOKESH: నియంత పాలనలో నోరెత్తడం నేరమే: లోకేశ్‌

LOKESH: నియంత పాలనలో నోరెత్తడం నేరమే: లోకేశ్‌

నియంత పాలనలో నోరువిప్పడం నేరమేనని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా వైసీపీ నాయకులు చేస్తున్న అకృత్యాలను బయటపెట్టిన ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై.. వేటు వేయడం దారుణమని మండిపడ్డారు. కొండపై.. వైకాపా నేతలు, కొంత మంది అధికారులు కలిసి చేస్తున్న దారుణాలపై.... ఆ కలియుగ దైవమే రమణ దీక్షితులు నోటి నుంచి భక్తులకు తెలిసేలా చేశారన్నారు. చేసిన తప్పులు, పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోకుండా... రమణ దీక్షితులుపై కేసు పెట్టడం, అరెస్ట్ చేయాలని చూడటం.. జగన్ అహంకారానికి నిదర్శనమని దుయ్యబట్టారు. దేవుడి జోలికి వెళ్లిన వారు ఎవ్వరూ బాగుపడినట్టు చరిత్రలో లేదన్నారు. దైవంతో ఆటలొద్దంటూ జగన్ ను హెచ్చరించారు.


మరోవైపు విశాఖలో వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్‌ బ్రిడ్జి రెండోరోజే తెగిపోవడంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ ఎక్స్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్‌ అవినీతి భారాన్ని తట్టుకోలేక ఫ్లోటింగ్‌ బ్రిడ్జి కొట్టుకుపోయిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రజల ప్రాణాల్ని పణంగా పెట్టే ఇలాంటి చర్యలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. అబ్బాయ్ ప్రారంభించిన బస్‌ బే గాలికి ఎగిరిపోతే........ బాబాయ్ రిబ్బన్ కట్ చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జి అలలకు కొట్టుకుపోయిందని ఎద్దేవా చేశారు. మూడు ముక్కలాట బ్యాచ్‌ పనులన్నీ ఇంతే అని విమర్శించారు.

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయనున్నట్లు... నరసాపురం ఎంపీ లావు కృష్ణదేవరాయలు వెల్లడించారు.త్వరలో తెలుగుదేశంలో చేరుతానని స్పష్టంచేశారు. పల్నాడు జిల్లా ప్రజలకు బహిరంగ లేఖ రాసిన ఆయన............ ఐదేళ్లుగా నరసరావుపేట నియోజకవర్గ ప్రజలు ఎంతో ప్రేమాభిమానాలు చూపించారని... గుర్తుచేసుకున్నారు. గత ఐదేళ్లలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని పల్నాడు జిల్లా అభివృద్ధికి కృషి చేశానని..మరోసారి అవకాశం ఇస్తే మరింత ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.వరికపూడిశెల ఎత్తిపోతల పథకానికి ఇప్పటికే అనుమతులు తెచ్చానని...... ఆ ప్రాజెక్టుని పూర్తిచేసి పల్నాడు ప్రజల చిరకాలవాంఛ నెరవేరుస్తానని కృష్ణదేవరాయలు తెలిపారు. 12వందల కోట్లతో వాటర్ గ్రిడ్ పనులు, సాగర్ కుడికాలువకు నకరికల్లు వద్ద లిఫ్ట్ ఏర్పాటు..., పిడుగురాళ్ల వైద్యకళాశాల, 3వేల కోట్లతో మంజూరైన జాతీయ రహదారుల్ని పూర్తి చేయించడం........ తన లక్ష్యమని పేర్కొన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి.. వారి అభివృద్ధి కోసం పనిచేస్తానని బహిరంగ లేఖలో వివరించారు. మరోవైపు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి, విజయవాడ నగర వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్.., కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ ... తెలుగుదేశంలో చేరారు. అనుచరులతో కలిసి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన నేతలు నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. మరోవైపు.. చంద్రబాబు సమక్షంలో రెండు రోజుల్లో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు......... మైలవరం MLA వసంత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. స్థానిక నేతలతో చర్చించి...... కార్యకర్తలందరినీ కలిసి చంద్రబాబు వద్దకు వెళ్తానని వెల్లడించారు. దేవినేని ఉమతో తనకు వ్యక్తిగత వైరాలు లేవని........ వసంత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. అధిష్ఠానం సమక్షంలో దేవినేనితో అన్నీ మాట్లాడుకుంటామన్నారు. వైసీపీలో విపక్షాలను దూషిస్తేనే మంత్రి పదవులు ఇస్తారని వసంత కృష్ణ ప్రసాద్ ఆరోపించారు.

Tags

Read MoreRead Less
Next Story