Makar Sankranti Special Trains 2022: పండక్కి ఊరెళ్దాం.. సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్

Makar Sankranti Special Trains 2022: కొత్త ఏడాది వస్తూనే సంక్రాతి సరదాలని మోసుకొస్తుంది.. పట్నంలోని వారంతా పల్లెలకు పయనమవుతుంటారు.. అక్కడ తమ వాళ్లతో కలిసి ఆనందంగా పండుగ జరుపుకోవాలని సంబరపడుతుంటారు. అలాంటి వారికోసమే రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రయాణీకులకు ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.
* 07067-07068 మచిలీపట్నం - కర్నూలు (జనవరి 1 నుంచి 30వ తేదీ వరకు)
* 07455 నర్సాపూర్ - సికింద్రాబాద్ (2, 9, 16, 23, 30)
* 07456 సికింద్రాబాద్ - విజయవాడ (3, 10, 17, 24, 31)
* 07577 మచిలీపట్నం - సికింద్రాబాద్ వయా ఖాజీపేట (2, 9, 16, 23, 30)
* 07578 సికింద్రాబాద్ - మచిలీపట్నం వయా గుంటూరు (2, 9, 16, 23, 30)
* 07605 తిరుపతి - అకోలా (7, 14, 21, 28)
* 07606 అకోలా - తిరుపతి (9, 16, 23, 30)
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com