Srikakulam : వైసీపీకి చెందిన 150 కుటుంబాలు టీడీపీలో చేరాయి

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీకి చెందిన 150 కుటుంబాలు టీడీపీలోకి చేరాయి. ఎంపీ రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే బెందాళం అశోక్‌బాబు సమక్షంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఎంపీ రామ్మోహన్‌నాయుడు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జగన్ సర్కారుపై ఎంపీ రామ్మోహన్‌నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నాడు చంద్రబాబు హయంలో ఒక్కపైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదన్నారు. మారుమూల గ్రామాలకు 24 గంటలు కరెంట్ ఇచ్చిన ఘనత చంద్రబాబుదే అని చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చాక 7సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారని ఆరోపించారు. పేదవాడి కష్టాన్ని వైసీపీ ప్రభుత్వం దోచుకుంటోందని మండిపడ్డారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఏపీలోనే పెట్రోలు, డీజీల్ ధరలు ఉన్నాయన్నారు. జనం నుంచి దోచుకున్న డబ్బులు ఎక్కడికి పోతున్నాయని ప్రశ్నించారు. చంద్రబాబు మళ్లీ సీఎం అయితేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని రామ్మోహన్‌నాయుడు స్పష్టంచేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com