వైసీపీ పథకాలు.. పైన పటారం లోన లొటారం : ఎంపీ రామ్మోహన్ నాయుడు

వైసీపీ పథకాలు.. పైన పటారం లోన లొటారం : ఎంపీ రామ్మోహన్ నాయుడు

వైసీపీ సర్కారు పాలన శంకుస్థాపనలకే పరిమితమైందని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. వైసీపీ నేతలు వేల కోట్ల రూపాయల ప్రజాధనం దండుకుంటున్నారని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కార్యకర్తల సమావేశంలో ప్రసంగించిన రామ్మోహన్‌.... వైసీపీ ప్రభుత్వంలోని పథకాలు పైన పటారం లోన లొటారం అన్న ఛందంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. మూడు వేల రూపాయల పెన్షన్‌ హామీని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. జగన్‌ పాలనకు వాత పెట్టాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story