Srisailam : నిండిన శ్రీశైలం.. సాగర్‌కు వరద.. గేట్లు తెరిచేందుకు రెడీ
ఎగువన కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా పరివాహక ప్రాజెక్టులకు వరదకొనసాగుతోంది. ఆల్మట్టిడ్యాంకు వరద పోటెత్తడంతో వచ్చిన నీరు వచ్చినట్లు కిందికి వదులుతున్నారు. ఆల్మట్టి పూర్తి సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 74.11 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఆల్మట్టి నుంచి 2,64,829 క్యూసెక్కుల నీరు విడుదల చేయగా, నారాయణపూర్ జలాశయానికి పరవళ్లు తొక్కుతోంది. నారాయణపూర్ డ్యాం సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 29.04 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దీంతో రిజర్వాయర్ గేట్లు ఎత్తి 9,01,033 క్యూసెక్కుల నీరు విడుదల చేయడంతో జూరాలకు కృష్ణమ్మ పరుగులు పెడుతూ వస్తోంది.
జూరాల ప్రాజెక్టులోకి శిలక్షల 10 వేల క్యూసెక్కుల వరద చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 41 గేట్లు ఎత్తి 2,74,964 క్యూసె క్కులు నీరు స్పిల్వే ద్వారా కిందకు విడిచిపెడుతున్నారు. జలాశయం పూర్తి నీటి నిల్వ 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 7.63 టీఎంసీలుగా అధికారులు నిర్వహిస్తున్నారు. జూరాల నుంచి విడుదలవుతున్న నీరంతా శ్రీశైలం జలాశయంలోకి పరుగులు పెడుతోంది. అటు తుంగభద్ర నుంచి లక్ష క్యూసెక్కుల వరకు వరద నీరు శ్రీశైలం రిజర్వాయర్లోకి చేరుతోంది. ఈ వరద గంట ఈ గంటకు పెరుగుతుండడంతో శ్రీశైలం డ్యాం నిండుకుండను తలపిస్తోంది.
ఇప్పుడున్న పరిస్థితులను అంచనా వేసిన అధికారులు మంగళవారం నాటికి శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తాలని నిర్ణయించారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 4 లక్షల 69 వేల 5 22 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 62,847 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 887 అడుగులు. అయితే ఇప్పటికే శ్రీశైలం డ్యామ్ ప్రస్తుత నీటిమట్టం 873.40 అడుగులకు చేరింది. ఇక కుడిగట్టు, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com