Gudlavalleru : గుడ్లవల్లేరు ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు

Gudlavalleru : గుడ్లవల్లేరు ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు

గుడ్లవల్లేర్లు కళాశాల యాజమాన్యానికి రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. లేడీస్ హాస్టల్ వాష్ రూమ్లలో హిడెన్ కెమెరాలు, అందులో 300 మంది స్టూడెంట్స్ ఉన్నారని ప్రచారంలోకి రావడంతో స్పందించిన మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి ఘటనను సుమోటో కేసుగా నమోదు చేశారు.

విచారణలో భాగంగా హాస్టల్ విద్యార్థినీలతో సంభాషించి హాస్టల్ వాష్ రూమ్స్ పరిశీలించారు. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యాన్ని గుర్తించిన మహిళా కమిషన్ పలు అనుమానాలు వ్యక్తం చేసింది. దీంతో కాలేజీ యాజమాన్యం, హాస్టల్ సిబ్బందికి నోటీసులు జారీ చేస్తూ ఈనెల 10వ తేదీన విచారణకు హాజరుకావాల్సిందిగా కమిషన్ ఆదేశించింది.

Tags

Next Story