పోలవరం పనులు నిలిపివేయడం ఉత్తరాంధ్రపై కక్షసాధింపు చర్యే : టీడీపీ అధినేత చంద్రబాబు

పోలవరం పనులు నిలిపివేయడం ఉత్తరాంధ్రపై కక్షసాధింపు చర్యే : టీడీపీ అధినేత చంద్రబాబు
పోలవరం పనులు నిలిపివేయడం ఉత్తరాంధ్రపై వైసీపీ కక్షసాధింపు చర్యగా అభివర్ణించారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. టీడీపీ పై అక్కసుతోనే ఉత్తరాంధ్ర అభివృద్దికి..

పోలవరం పనులు నిలిపివేయడం ఉత్తరాంధ్రపై వైసీపీ కక్షసాధింపు చర్యగా అభివర్ణించారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. టీడీపీ పై అక్కసుతోనే ఉత్తరాంధ్ర అభివృద్దికి వైసీపీ గండి కొడుతోందన్నారు. అనకాపల్లి పార్లమెంట్ పై నేతలతో చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలవరం పనులు నిలిపివేసి విశాఖ, అనకాలపల్లి ప్రజలకు వైసీపీ ప్రభుత్వం తీరని ద్రోహం చేసిందన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఇతర సాగునీటి ప్రాజెక్టుల పనులన్నీ ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిన్నర కాలంగా రాష్ట్రంలో ఇసుక దొరకకుండా పోయిందని, దీంతో లక్షలాదిమంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags

Next Story