Rain Alert : మొంథా తుఫాన్.. ప్రజలు బీ అలర్ట్..

మొంథా తుఫాన్ తీర ప్రాంతాల్లో ప్రారంభం అయిపోయింది. దాని ఎఫెక్ట్ తీరం వెంబడి ఉన్న జిల్లాల్లో ప్రధానంగా కనిపిస్తోంది. ఇలాంటి ప్రకృతి విపత్తులను ఎవరు ఆపలేరు. కానీ వాటిని ఎంత సమర్థంగా ఎదుర్కొన్నామనేది ఇక్కడ ఇంపార్టెంట్. కూటమి ప్రభుత్వం చాలా అలర్ట్ గా ఉంది. తుఫాన్ రాకముందే తీసుకోవాల్సిన చర్యలు అన్ని సీఎం చంద్రబాబు నాయుడు తీసేసుకున్నారు. ఇలాంటి ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో ఆయనకు అపార అనుభవం ఉంది. కాబట్టి తన అనుభవంతో ఎన్ని రకాల చర్యలు తీసుకోవాలి.. ఎవరెవరిని పునరావాస కేంద్రాలకు తరలించాలి అనేది ఆయనకు బాగా తెలుసు. అందుకే ఇప్పటికే కొండ ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివాసముండే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇంకా చాలామంది అక్కడే ఉండటంతో వారిని కూడా తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో ఒక్కో ఫ్యామిలీకి మూడు వేల రూపాయలు నాణ్యమైన భోజనం, 25 కిలోల బియ్యం, సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా సరిపోయే అన్ని సరుకులు, హెల్త్ కేంద్రాలు, దుస్తులు, శుభ్రంగా ఉండే రూములు ఏర్పాటు చేశారు. అటు రాష్ట్రవ్యాప్తంగా అధికారులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ గంట గంటకు కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ తుఫాన్ కోసం రూ.19 కోట్లు తక్షణ సాయం కింద రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలను వేల మందిని జిల్లాలకు తరలించారు.
అంబులెన్సులు, లోతట్టు ప్రాంతాల్లో బోట్లు, డ్రోన్లు, హెలికాప్టర్లు అందుబాటులో ఉంచారు. 27 మంది ఐఏఎస్ అధికారులకు ఈ ప్రకృతి విపత్తును ఎదుర్కొనే బాధ్యతలను అప్పగించారు. వారితో ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు మాట్లాడుతూ దిశా నిర్దేశాలు చేస్తున్నారు. వందల మంది గజ ఈతగాళ్లను రంగంలోకి దింపారు. వైద్యం, విద్యుత్, ప్రకృతి విపత్తి, పోలీసులు, మున్సిపల్ శాఖ ఉద్యోగులను రంగంలోకి దించారు. వారికి సెలవులు కూడా రద్దు చేశారు. ఇలా ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకన్నా సరే.. ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిందే. టీవీ5 తరఫున మిమ్మల్ని కోరేది ఒకటే. ఇలాంటి ప్రకృతి విపత్తులను అడ్డుకోవడం ఎవరి తరం కాదు. కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఆస్తుల కంటే ప్రాణాలు చాలా ముఖ్యం. కాబట్టి మీ దగ్గరికి అధికారులు వచ్చి మిమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తాం అన్నప్పుడు వారి వెంట వెళ్లండి. కొండ ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇంటిని విడిచి రాలేం అని మాత్రం చెప్పకండి. ఎందుకంటే ఒకసారి తుఫాను ప్రభావం నేర్చుకుపడ్డ తర్వాత దాని నష్టం ఊహకు కూడా అందదు. కాబట్టి ప్రమాదం వచ్చిన తర్వాత అధికారుల కోసం ఎదురుచూడటం కంటే మీ దగ్గరకు వచ్చినప్పుడే వారి వెంట వెళ్ళండి. ఇంటిని విడిచి రాలేం అని మాత్రం చెప్పకండి.
ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే వెంటనే హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేయండి. మీ చుట్టూ ఎవరైనా గర్భిణీలు, వృద్ధులు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతుంటే సాయం చేయండి. యువకులు అధికారులకు సపోర్ట్ చేస్తూ మీ చుట్టూ ఉన్న ప్రజలను సమస్యల నుంచి బయటపడేయండి. తుఫాన్ ఏం చేస్తుందిలే అని నిర్లక్ష్యంగా రోడ్లమీదకు మాత్రం రాకండి. ఎందుకు అంటే తీర ప్రాంతాల్లో తుఫాన్ గాలులు, వర్ష బీభత్సం మామూలుగా ఉండదు. రోడ్ల పైన వెళ్తుంటే స్తంభాలు చెట్లు విరిగిపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. కరెంటు స్తంభాలను అస్సలు ముట్టుకోకండి. వాగులు వంకలు తెగే అవకాశం ఉన్నందున బ్రిడ్జిల పైన వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి శుభ్రంగా చేతులు కడుక్కున్న తర్వాత మాత్రమే తినండి. కనీస జాగ్రత్తలు పాటించండి. కలుషిత నీరు తాగకండి. ప్రభుత్వం చెబుతున్న సూచనలను, జాగ్రత్తలను ఎప్పటికప్పుడు పాటించండి. అధికారులు చెప్పే విషయాలను మీడియా ఛానల్ ద్వారా తెలుసుకోండి. సోషల్ మీడియాలో వచ్చే భయపెట్టే వీడియోలు చూసి నమ్మకండి. ప్రభుత్వ వాట్సప్ గ్రూపులు కూడా ఉన్నాయి. అందులో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోండి. ప్రభుత్వ బాధ్యతలతో పాటు మీ బాధ్యతగా కనీస జాగ్రత్తలు తీసుకోండి. ఒక్క ప్రాణం కూడా పోవద్దు అనే చంద్రబాబు నాయుడు ఆరాటాన్ని అర్థం చేసుకోండి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

